ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది.. గత అయిదు నెలలుగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు... రాష్ట్రంలో విధ్వంశకర పాలన కొనసాగుతుంది... రాజకీయ కక్షలతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అధికార పార్టీ నాశనం చేస్తుంది... ఇసుకను పక్క రాష్ట్రాలకు అమ్ముకునే ప్రయత్నం అధికార పార్టీ నేతలు చేస్తున్నారు. మేము 68 మంది జాబితాను సిద్ధం చేసాం. అమరావతి ఆగిపోయింది... కనీసం మ్యాప్ లో కూడా కనపడటం లేదు. 


జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం పనులు ఆగిపోయాయి.. ఇసుక దొరకక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు... పోలీసులు అధికార పార్టీ నేతలకు సహకరిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు నారా లోకేష్ సహా పలువురు పదే పదే చేస్తున్న ఆరోపణలు ఇవి... ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఏమీ బాలేదు అనే విషయాన్ని జాతీయ మీడియాకు వివరించే ప్రయత్నాలు తెలుగుదేశం నేతలు చేస్తున్నారు. 


కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త... పరకాల ప్రభాకర్ కు చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉన్నాయి. పార్టీ అధికారంలోకి రాగానే ఆయనకు పదవి కూడా ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు ఆయన ద్వారా జాతీయ మీడియాకు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించి మద్దతు పొందాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం తనతో అత్యంత సన్నిహితంగా ఉండే రెండు మీడియా చానెల్స్ అధినేతలను కూడా చంద్రబాబు వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 


ఇందుకోసం కార్మికుల మరణాల మీద ఒక నివేదికను కూడా జాతీయ మీడియాకు చంద్రబాబు సన్నిహితులు అందించారు అనేది అర్ధమవుతుంది. త్వరలోనే జాతీయ మీడియా బృందం ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి ఇక్కడి పరిస్థితుల మీద కొన్ని నివేదికలు కూడా తయారు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అటు మానవ హక్కుల సంఘం బృందం కూడా పర్యటించింది కాబట్టి... వీటిని కూడా జాతీయ మీడియాకు వివరించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: