వల్లభనేని వంశీ....గత రెండు రోజులుగా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన వ్యక్తి. టీడీపీ తరుపున గన్నవరం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీపై ఇటీవల నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారని కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు రాగానే వంశీ..వైసీపీలో ఉన్న తన మిత్రుడు, మంత్రి కొడాలి నానితో కలిసి సీఎం జగన్ తో భేటీ అయిపోయారు. ఇక దీని తర్వాత టీడీపీకి రాజీనామా చేసేశారు. దీంతో అధినేత చంద్రబాబు...వంశీని బుజ్జగించే కార్యక్రమాలు చేశారు.  కానీ వంశీ వెనక్కి తగ్గలేదు. 


రాజీనామా చేసి కొన్ని రోజులు సైలెంట్ గా ఉండిపోయి హఠాత్తుగా...బాబు ఇసుక కోసం దీక్ష చేస్తున్న రోజునే బయటకొచ్చి, చంద్రబాబు, లోకేశ్ లపై తీవ్ర వ్యాఖ్యలతో ఇరుచుకుపడి జగన్ కు మద్ధతు ఇస్తున్నాని ప్రకటించారు. అయితే ఇక్కడ పరిస్థితులని గమనిస్తే వంశీ, స్నేహితుడు కొడాలి నాని కూడా 2009లో టీడీపీ తరుపున రెండో సారి ఎమ్మెల్యే గెలిచి, పార్టీని వీడుతూ బాబుపై తిట్ల దండకం చదివి వైసీపీలోకి వెళ్లారు. ఇక ఆ తర్వాత నాని రెండు సార్లు వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు మంత్రి కూడా అయ్యారు. 


అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు మంచి మిత్రులు, ఇద్దరికీ జూనియర్ ఎన్టీఆర్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ విషయాన్ని పక్కనబెట్టేస్తే, ఇద్దరు టీడీపీలో మాస్ లీడర్లుగా ఎదిగారు. ఇద్దరికి ప్రత్యేక అభిమాన వర్గాలు ఉన్నాయి. ఆ అభిమాన వర్గం వల్లే టీడీపీకి కంచుకోటగా ఉన్న గుడివాడలో నాని వైసీపీలో రెండు సార్లు గెలవగలిగాడు.  గుడివాడలో టీడీపీ, వైసీపీలకు కేడర్ ఉన్న, కొడాలికి సెపరేట్ కేడర్ ఉంది. 


అలాగే ఇప్పుడు వంశీ కూడా గన్నవరంలో ప్రత్యేక కేడర్ ఏర్పరచుకున్నారు. ఇప్పుడు అదే కేడర్ తో వంశీ మళ్ళీ ఎన్నికల్లో నిలబడితే విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ మద్ధతు ఓటర్లు ఉన్నా...వంశీకి ప్రత్యేక మద్ధతుదారులు ఉన్నారు. దాంతో వంశీ కూడా వైసీపీలో మరో కొడాలి నాని లాగా మారే అవకాశాలున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: