తండ్రి అయినా...కొడుకుని మంచి పొజిషన్ లో చూడాలనే అనుకుంటాడు. అతని మంచి పొజిషన్ కు వచ్చేవరకు అన్ని విధాలా కష్టపడతారు. ఈ విధంగానే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన తనయుడు లోకేశ్ ను మంచి రాజకీయ నాయకుడు చేయాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే గత 2014 ఎన్నికల్లో లోకేశ్ పోటీ చేయకపోయిన అతడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని కూడా చేశారు. అయితే కష్టపడకుండా వచ్చిన పదవి ఎక్కువ కాలం నిలువదు కదా.


అందుకే టీడీపీకి ఈ సారి అధికారం కూడా దక్కలేదు. అటు లోకేశ్ కూడా తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవలేదు. సరే లోకేశ్ సత్తా ఇంతే అనుకుని బాబు వదులుతున్నారా? అంటే లేదు. ప్రతిపక్షంలో ఉన్న కుమారుడు కోసం కష్టపడుతూనే ఉన్నారు. తన తర్వాత తన కుమారుడే పార్టీని నడిపించాలని భావిస్తున్నారు. అందుకే లోకేశ్ కు అన్ని పవర్స్ ఇచ్చేశారు. ఇక బాబు తర్వాత లోకేశ్ అన్ని తానై పార్టీని నడిపించే కార్యక్రమం చేస్తున్నారు.


అయితే ఇక్కడే అసలు ఇబ్బందులు మొదలయ్యాయి. బాబు కుమారుడుపై పెట్టిన శ్రద్ధ పార్టీ మీద పెట్టినట్లు కనిపించడం లేదు. అందుకే చాలామంది నేతలు లోకేశ్ అసమర్ధుడు అని భావిస్తూ, బాబు తర్వాత టీడీపీకి ఇక భవిష్యత్ లేదని అనుకుంటూ పార్టీలు మారిపోతున్నారు. అయితే పార్టీలు మారే వాళ్ళు ఎక్కువ శాతం లోకేశ్ గురించే కామెంట్ చేస్తున్నారు. లోకేశ్ ఎందుకు పనికి రాడని, కొడుకు కోసం బాబు పార్టీని నాశనం చేస్తున్నారని అంటున్నారు. ఇక ఇది చాలావరకు నిజమే అని తెలుగు తమ్ముళ్ళు కూడా భావిస్తున్నారు. బాబు...కాసేపు లోకేశ్ విషయం పక్కనబెట్టి పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలతో ఒక్కసారి మాట్లాడితే పరిస్థితులు వేరుగా ఉండేవని అంటున్నారు. 


తాజాగా దేవినేని అవినాష్, వల్లభనేని వంశీలని పర్సనల్ గా పిలిచి మాట్లాడి ఉంటే ఇద్దరు పార్టీలో ఉండేవారని, వాళ్ళని పట్టించుకుపోవడం వల్లే వెళ్లిపోయారని చర్చించుకుంటున్నారు. ఇక ఎలాగో మరి కొందరు ఎమ్మెల్యేలు కూడా త్వరలో పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్న తరుణంలో బాబు జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే కొడుకు కోసం చూస్తే ప్రతిపక్ష హోదా కూడా మిగలదని తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: