కొన్ని సార్లు అంతే.. జీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పుతాయి. మనం అనుకుంటూ ఉంటాం.. ధనవంతులు ధనవంతుడు అవుతూనే ఉంటాడు పేదవాడు పేదవాడిలానే ఉంటాడు అని.. నిజమే కానీ ఇది అన్ని సార్లు జరగదు. ఒకప్పుడు దేశంలో అందరికంటే ధనవంతుడిగా ఒక వెలుగు వెలిగిందా అతను ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. 

                              

ఏంటి అనుకుంటున్నారా ? నిజం అండి నిజం. ధీరుభాయ్ అంబానీ ముద్దుల కొడుకు, ముకేశ్ అంబానీ తమ్ముడు అయిన అనిల్ అంబానీ కథ ఇది. ఇంకా విషయానికి వస్తే.. అనిల్ అంబానీ తాజాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలిగారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన అతన్ని ఈ కంపెనీ నుంచి రక్షించలేక ఆయన చేతులెత్తిసిన విషయం తెలిసిందే. 

                              

ఇప్పుడు తాజాగా అనిల్ అంబానీ ఆర్‌కామ్ కంపెనీ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేశారు. కేవలం అనిల్‌ అంబానీ మాత్రమే కాదు అతనితో పాటు మరో నలుగురు డైరెక్టర్లు కూడా ఈ కంపెనీకి రాజీనామా చేశారు. అనిల్‌ అంబానీతో పాటు ఛాయా విరాణి, రైనా కరానీ, మంజరి కకేర్‌, సురేష్‌ రంగాచారీలు డైరెక్టర్‌లుగా వైదొలిగారు.

            

గతంలో కంపెనీ డైరెక్టర్‌, సీఎఫ్‌ఓ వి.మణికంఠన్‌ రాజీనామా చేశారని, వీరి రాజీనామాలను కంపెనీ రుణదాతల కమిటీకి నివేదిస్తామని ఆర్‌కామ్‌ తెలిపింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ బీఎస్‌ఈకి ఇచ్చిన నోటీసులో ఈ అంశాన్ని తెలియజేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నష్టాలు రూ.30,142 కోట్లకు చేరిన విషయం అందరికి తెలిసిందే.
 



మరింత సమాచారం తెలుసుకోండి: