ఈ ప్రపంచంలో జరుగుతున్న వింతలను విశేషాలను చూస్తుంటే ఒక్కోసారి ఆశ్చర్యమేస్తుంది. లేకుంటే మానవ జన్మలో ఎన్ని మర్మాలో, ఈ సృష్టిలో ఎన్ని మాయలో ఇకపోతే ఓ వింత జననం జరిగింది. ఈ లోకంలోని సృష్టిలో ఇదొక అద్భుతం. కాని ఇలా పుట్టిన ఆ బేబి ఎంత సమయం వరకు బ్రతుకుతుందో తెలియదు. పూర్తి వివరాలు తెలుసుకుంటే పోర్చుగల్‌ రాజధాని లిస్బన్‌లో తల లేని శిశువు జన్మించింది.


అయితే, తలకు ఆదారమైన పుర్రె లేకుండా పుట్టిన ఆ శిశువుకు కళ్లు కూడా ఏర్పడలేదని, చెవులు, ముక్కు లేకపోవడంతో శరీరం భాగంలోని అస్పష్టంగా ఉన్న నోటి నుంచి శ్వాస పీల్చుకుంటోందని పోర్చుగల్ పత్రికలు, వెబ్‌సైట్లు శుక్రవారం వెల్లడించాయి. ఇదేగాక ఆ చిన్నారి మరెన్నో గంటలు బతకదని వైద్యులు కూడా తేల్చి చెప్పేశారు. ఇకపోతే ప్రస్తుతం ఆ శిశువు పరిస్థితి ఎలా ఉందనేది తెలియరాలేదు.


ఆ శిశువు కొన్ని గంటలే బ్రతుకుతాడని, కాబట్టి ఈ శిశువును హాస్పిటల్‌లో తమ ఆధీనంలో ఉంచాలని వైద్యులు తెలిపారు. అయితే, బిడ్డను తమతోనే తీసుకెళ్తామని, తుదిశ్వాస వరకు ఆ బిడ్డ తమతోనే ఉండాలని, ఆ బిడ్డ తల్లిదండ్రులు కోరారు. దీంతో ఆ శిశువును ఇంటికి తీసుకెళ్లేందుకు వైద్యులు అంగీకరించారు. అంతే కాకుండా ఆ శిశువుకు ప్రత్యేకంగా శ్వాస అందించేందుకు సదుపాయం కల్పించారు.


అలాగే ఎప్పటికప్పుడు ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వైద్యం అందించేందుకు ప్రత్యేకంగా శిశువైద్య నిపుణుల బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇకపోతే  గర్భంతో ఉన్నప్పుడు ఈ బిడ్డ తల్లి మార్లెనే స్కానింగ్‌, అల్ట్రా సౌండ్ టెస్టులు చేయించుకున్నా.. శిశువులో పెరుగుదలలో ఉన్న ఈ సమస్యలను గుర్తించలేకపోయారు. కానీ ప్రసవానికి కొద్ది రోజుల ముందు తీయించుకున్న 5డీ స్కానింగ్‌లో మాత్రమే ఈ సమస్య తెలిసింది.


అయితే, అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. పాప జననం వింతగా మారింది. ఇక అక్కడి ప్రభుత్వం ఈ సమాచారం పత్రికల ద్వారా తెలుసుకుని, పరీక్షలు చేసిన నాలుగు స్కానింగ్ కేంద్రాలపై ఆరు నెలలు నిషేదం విధించింది. అంతే కాకుండా ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: