తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 43 వ రోజుకు చేరుకున్న విషయం. అయితే తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె పై హైకోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది. కాగా  గత కొన్ని రోజుల కింద ఆర్టీసీ సమ్మె  పై హైకోర్టులో  మొదలైన విచారణ వాయిదా పడుతూ వస్తోంది. అయితే తాజాగా ఆర్టీసీ ఇంచార్జి ఎండి  సునీల్ శర్మ హైకోర్టులో తుది అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.కాగా  దీనిపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పందించారు. ఆర్టీసీ ఇన్చార్జి ఎండిగా  ఉన్న సునీల్ శర్మ కు అసలు ఆర్టీసీ గురించి ఏం తెలుసు అంటూ అశ్వద్ధామ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అఫిడవిట్ తయారు చేసి ఇస్తే ఆర్టీసీ  ఇంచార్జ్ ఎండీ  సునీల్ శర్మ సంతకం పెడుతున్నారని... ఆయన  హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో మొత్తం పొలిటికల్ అఫిడవిట్ అంటూ విమర్శించారు అశ్వత్థామరెడ్డి. 



 ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ గా  సునీల్ శర్మ బాధ్యతలు చేపట్టి 17 నెలలు మాత్రమే అయిందని కనీసం ఆయన ఏడు సార్లు కూడా ఆఫీస్ కి వచ్చి ఉండరు అంటూ  అశ్వద్ధామ రెడ్డి విమర్శించారు. ఆర్టీసీ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న ఫైలు కుప్పలుతెప్పలుగా పేరుకుపోయాయి  అంటూ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఇక ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ రాజకీయ నాయకులు అఫిడవిట్ లాగా  తలపిస్తుంది అంటూ ఆయన విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె వల్లే సంస్థ నష్టపోయింది అనడం సరికాదన్నారు అశ్వత్థామరెడ్డి. టిఆర్ఎస్ ప్రభుత్వ విధానాలే ఆర్టీసీ సంస్థ నష్టానికి కారణమవుతున్నాయని ఆయన తెలిపారు. అయితే ఆర్టీసీ సమ్మె ... చట్ట  వ్యతిరేకమైనది అని  హైకోర్టు  నిర్ధారించాలని ఆర్టీసి ఇన్చార్జి ఎండీ  సునీల్ శర్మ దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు అయితే దీనిపై స్పందించిన అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె చట్ట విరుద్ధమా... చట్ట వ్యతిరేకమా అనేది హైకోర్టు తేలుస్తుంది  అంటూ హితవు పలికారు. 



 ఇదిలా ఉండగా అటు ఆర్టిసి ఇంచార్జ్ ఎండి సునీల్ శర్మ దాఖలు చేసిన అఫిడవిట్లో ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపలేమని  పేర్కొన్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు తాత్కాలికంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ను పక్కనబెట్టి నప్పటికీ... ఏ క్షణంలో ఆయన ఆ డిమాండ్తో ప్రభుత్వాన్ని మరోసారి ఇరకాటంలో పడేసే  అవకాశం ఉన్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు ఆర్టీసీ ఇంచార్జ్  ఎండీ సునీల్ శర్మ. అందుకోసమే తాము ఆర్టీసీ కార్మికులతో చర్చలు కు సిద్ధంగా లేము అంటూ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట విరుద్ధమైన సమ్మెగా  నిర్ధారించారని హై కోర్టుకు విజ్ఞప్తి చేశారు ఇంచార్జ్ ఎండి సునీల్ శర్మ. అయితే దీనిపై హైకోర్టులో  ఈనెల 18న విచారణ జరగనుండగా  హైకోర్టు సునీల్  శర్మ సమర్పించిన అఫిడవిట్ పై  స్పందిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: