జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి ఎందుకు వెళ్లారు ? జనసేన వర్గాలు చెప్తున్న దాని ప్రకారం ఆయన ఒక ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారని... తెలుగుదేశం వర్గాలు చెప్పే దాని ప్రకారం చూస్తే ఆయన ప్రభుత్వం మీద... తనపై చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలు, రాష్ట్రంలో ఇసుక కొరత, కార్మికుల మరణాల మీద ఫిర్యాదు చేయడానికి వెళ్లారని... రాజకీయ వర్గాల ప్రకారం చూస్తే ఆయన జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి వెళ్లారని. ఈ మూడు వాదనల్లో ఎక్కువగా పస ఉన్న వాదన మాత్రం... మూడో వాదనే.


అవును ఇప్పుడు ఆ వాదన చుట్టూనే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వెనుక తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు అనేది రాజకీయ వర్గాల్లో చర్చ. ఆయన వెళ్లి... ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాను కలుస్తారు అనేది రాజకీయ వర్గాల అభిప్రాయం. 


ఈ భేటీల్లో దాదాపుగా ఖరారైన భేటీ... జెపి నడ్డా... ఆయన్ను కలిసి జనసేన విలీనానికి సంబంధించిన ప్రతిపాదనను వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవల విశాఖలో జరిగిన లాంగ్ మార్చ్ దాదాపుగా విజయవంతం అయింది అనేది కొందరి మాట. ఈ నేపథ్యంలోనే ఆయన... దీనిని ఆధారంగా చేసుకునే ఢిల్లీ విమానం ఎక్కారని అంటున్నారు. 


ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి... ఈ సమావేశాల్లో పాల్గొనడానికి గాను... టీడీపీ ఎంపీలు ఢిల్లీలోనే ఉన్నారు. వారి సహకారంతో ఆయన ప్రధానిని కూడా కలిసే అవకాశం ఉందని, అలాగే టీడీపీ శ్రేయోభిలాషి సుజనా చౌదరి సహకారం కూడా తీసుకుని వెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: