
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇటీవల ఇసుక కొరత విషయంలో, కార్మికుల పక్షాన విశాఖ లాంగ్ మార్చ్ నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు అవసరమైతే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తానన్నారు. శుక్రవారం అకస్మాత్తుగా విజయవాడ నుంచి హస్తిన వెళ్లిన పవన్ కల్యాణ్ ఈ టూర్లో.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాని కలుస్తారని ఆ పార్టీ సానుభూతిపరులు ప్రచారంలో పెట్టారు. ఈ నేపథ్యంలో పవన్ ఢిల్లీ పర్యటన మరింత ఆసక్తిని రేపింది. అయితే, ప్రధాని, హోం మంత్రి కాదు కదా...రెండ్రోజులైనా ఆయన కేంద్రమంత్రులతో కూడా భేటీ కాలేదు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చామని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించడం...పవన్ టూర్ గురించి ఎక్కువ ఆలోచించవద్దనే విషయాన్ని స్పష్టం చేసిందని సోషల్ మీడియాలో పంచులు పేలుతున్నాయి.
ఢిల్లీ పర్యటనపై గతంలోనే సంకేతాలిచ్చిన పవన్...దూకుడుగా విమర్శలు చేస్తుండటంతో..కేంద్రప్రభుత్వ, బీజేపీ అగ్రనేతలతో మంతనాలు జరుగుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితులపై చర్చిస్తారని, వైసీపీపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తారని, ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరిని తెలుసుకుంటారని ప్రచారం జరిగింది. ఇలా చర్చలు జరుగుతున్న సమయంలో...పవన్ హస్తిన పర్యటనపై పార్టీ పరంగా క్లారీటీ ఇవ్వలేదు. ఈ సమయంలో...పార్టీ ముఖ్యనేత, జనసేనాని నమ్మినబంటు అయిన నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ...ఢిల్లీ వచ్చింది ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అని తెలిపారు. దీంతో, పవన్ టూర్ గురించి అంచనాలు మారాయి.
ఇదిలాఉండగా, చంద్రబాబే పవన్ ను బీజేపీ పెద్దల వద్దకు రాయబారానికి పంపారని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే పవన్ హస్తిన పర్యటనతో తమకు సంబంధం లేదని టీడీపీ స్పష్టం చేస్తోంది. ఢిల్లీలో ఉన్న పవన్ కల్యాణ్ ఢిల్లీలో జగన్ పరిస్థితి ఇది అంటూ… కాళ్లకు ఇసుక బస్తాలు కట్టుకొని సీఎం నడుస్తున్న ఫోటోను ట్వీట్ చేశారు. ఢిల్లీలో జగన్‌పై ఇలాంటి అభిప్రాయమే ఉందంటూ విరుచుకుపడ్డారు.
కామెంట్స్‌లో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయొద్దు. ఇతరుల పరువుకు నష్టం వాటిల్లేలా గానీ, వ్యక్తిగత దాడి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు. ఏ వర్గాన్ని కించపరచేలా కామెంట్స్ ఉండరాదు. ఈ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండని కామెంట్లను అభ్యంతరకరమైనవిగా గుర్తించండి వాటిని తీసివేసేందుకు మాకు సహకరించండి- ఇండియాహెరాల్డ్ గ్రూప్