జగన్ కి రాజకీయం తెలియదు అన్నది నిన్నటి మాట. జగన్ పదేళ్ళ రాజకీయాల్లో బాగా పండిపోయారు. ముఖ్యంగా ఏపీ రాజకీయలను ఆయన ఔపాసన పట్టేశారు. పాదయాత్ర నుంచి జగన్ ఎన్నో నేర్చుకున్నారు. ఏపీ భౌగోళిక, సామాజిక, ఆర్ధిక, రాజకీయ స్వరూపం జగన్ మెదడులో పదిలంగా పెట్టేసుకున్నారు. ఏ బటన్ నొక్కితే ఏం జరుగుతుందో. ఎక్కడ ఎవరిని ఎలా కంట్రోల్లో పెట్టాలో జగన్ కి తెలిసినంతగా ఇపుడు  ఎవరికీ తెలియదు అంటున్నారు. 


ఏపీలో కమ్మోళ్ళు కుమ్మేసుకోవడం ఎవరైనా చూశారా. కమ్మ నాయకులు, పైగా అదే టీడీపీకి చెందిన వారు, ఆ సామాజికవర్గం కోర్ కమిటీ మెంబర్లు వారు. వారే చంద్రబాబుతో చెడుగుడు ఆడేస్తున్నారు. బాబుని ఎవరూ ఇంతవరకూ అనని మాటలు అంటున్నారు. నిజానికి ఇందులో కొన్ని మాటలు, వెన్నుపోట్లు చరిత్రలు  గతంలో కొన్ని లక్షల సార్లు అందరూ అన్నవే, కానీ సాటి కమ్మ సామాజికవర్గం నేతలు బాబుని అంటూండడమే  కాదు, ఏకంగా పార్టీ కూసాలే కదిలించేస్తున్నారు.


ఇపుడు వల్లభనేని వంశీ లోకేష్ ని బాబును కలిపి మరీ ఏకుతూంటే తెలుగు జనాలు ఆశ్చర్యపోతున్నారు. బాబు కొడుకు లోకేష్ పప్పు అని ఏ రాం గోపాలవర్మో సినిమా తీస్తే ఫన్నీ, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అది  సెటైర్, ఏ రోజా లాంటి నాయకురాలు కామెంట్ చేస్తే అది ఫక్త్ రాజకీయం , కానీ వంశీ లాంటి వారు నిన్నటి దాకా అక్కడే  ఉంటూ వచ్చిన వారు. వారు కనుక లోకేష్ ని పప్పు అంటే ఇక టీడీపీకి పునాదులే కుదిపేసినట్లే.


 ఏ చంద్రబాబు అయితే తన రాజకీయ వారసుడు లోకేష్ అని కలకు గంటూ ఆశలు పెంచుకుంటూ టీడీపీ మొత్తాన్ని దారాదత్తం చేయాలనుకుంటున్నారో ఆ లోకేష్ ఉత్త పప్పు అని వంశీ లాంటి వారు అనేస్తే ఇక ఏపీలో  రాజకీయంగా టీడీపీకి మంచినీళ్ళు అయినా పుడతాయా. ఇదే జగన్ మాస్టర్ ప్లాన్. టీడీపీ కన్నును ఆ పార్టీ చేత్తోనే పొడిపించేస్తున్నారు. దీని వల్ల జగన్ కి పోయేది ఏమీ లేదు, టీడీపీకి మాత్రం నలభయ్యేళ్ళ పార్టీయే చరిత్రలో కలిసే పరిస్థితి వస్తోంది. దటీజ్ జగన్.



మరింత సమాచారం తెలుసుకోండి: