వల్లభనేని వంశీ ఫైర్ బ్రాండ్. ఆయన ఆవేశపరుడు అంటారు. అది గత మూడు రోజులుగా టీవీల్లో చూస్తున్న వారికి అర్ధమైపోతుంది. అయితే ఆయన ఆవేశంతో మాట్లాడుతున్నా ఎక్కడా తప్పులు చెప్పరు, ఉన్నది ఉన్నట్లుగానే చెబుతున్నారు. దాన్ని తట్టుకోవడం పసుపు శిబిరానికి ఇపుడు కష్టమైపోతోంది. వంశీ రగిల్చిన చిచ్చు ఇపుడు టీడీపీకి పెను ముప్పులా పరిణమించింది. 


వంశీ గత 20 రోజులుగా మెల్లగా పొలిటికల్ గేమ్  ఆడుతూ  సస్పెన్షన్ వరకూ కధను నడిపారు. ఇపుడు వంశీపైన ఏం చేయడానికి టీడీపీకి అవకాశం లేదు. ఆయన్ని బహిష్కరించడం ఒక్కటే మార్గం. ఆ అస్త్రం తీసేందుకు టీడీపీ హై కమాండ్ సిధ్ధంగా ఉందా లేదా అన్నది ఇపుడు ప్రశ్న. ఎందుకంటే  సస్పెన్షన్ తోనే వంశీ దాదాపుగా ఫ్రీ అయిపోయారు. ఆయన మీద బహిష్కరణ వేటు పడితే ఏ పార్టీకి చెందని సభ్యుడుగా అసెంబ్లీలో దర్జాగా అయిదేళ్ళ పాటు ఎమ్మెల్యే పదవిని అనుభవించవచ్చు. దాని కోసమే వంశీ రెచ్చగొడుతున్నారు. దీని మీద టీడీపీ హై కమాండ్ కూడా మల్లగుల్లాలు పడుతోంది. వంశీని బహిష్కరిస్తే ఒక్కరితో పోతుందా వెనకలా ఎంతమంది ఉన్నారో అని కూడా ఆలోచన చేస్తోంది.


అయితే వంశీ ఎపిసోడ్ ని ఆసక్తిగా మరికొంతమంది టిడీపీ ఎమ్మెల్యేలు చూస్తున్నారు. వారు సైతం పార్టీ గీత దాటేందుకు రెడీగా ఉన్నారు. అయితే బాబుని తిట్టి ఇదే రీతిగా వెళ్లాలా, లేక ఒక వర్గంగా పార్టీని చీల్చాలా అని ఆలోచన చేస్తున్నారుట. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఓ మీడియా సమవేశంలో మాట్లాడుతూ టీడీపీ నుంచి ఒక గ్రూప్ పార్టీని చీల్చి వెళ్ళిపోతోందని బాంబు పేల్చారు.  ఇపుడు ఆ గ్రూప్ కూడా వంశీ ఎపిసోడ్ ని ఆసక్తిగా చూస్తోంది.


పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఒక  ప్రత్యేక గ్రూప్ గా మారితే వారికి ఏ ఫిరాయింపూ వర్తించదు అంటున్నారు. అంటే ఏపీలో సాగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తూంటే తలపండిన చంద్రబాబు వూహకు అందకుండా ఉన్నాయని చెప్పాల్సివుంటుందని అంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా బాబు ఉన్నారు. ఆయనకు ఎక్కడ నుంచి సాయం కూడా లేదు. సరిగ్గా ఇదే తరుణమని పార్టీలో తమ్ముళ్ళు తలెగరేస్తున్నారు. మరి దీన్ని అపర చాణక్యుడు ఎలా ఎదుర్కొంటారో.


మరింత సమాచారం తెలుసుకోండి: