రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి చెందిన రంగులను ప్రభుత్వ కార్యాలయాలు పంచాయతీ కార్యాలయాలకు వేయించడం ప్రస్తుతం ట్రెండ్  గా మారిపోయింది. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన అన్ని పార్టీలు తమ తమ పార్టీ జెండాల రంగులను  ప్రభుత్వ కార్యాలయాలు  భవనాలు పంచాయతీ కార్యాలయాలకు వేయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న  టీడీపీ కూడా రాష్ట్రంలోని అన్ని భవనాలు కార్యాలయాలకు తెలుగుదేశం పార్టీ పసుపు రంగును వేయించింది . ఇక తాజా ఎన్నికల్లో భారీ మెజారిటీతో కైవసం చేసుకునే అధికారంలోకి వచ్చిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే పాటిస్తున్నారు. పార్టీ జండా కలర్లను రాష్ట్రం మొత్తం వేస్తున్నారు. 

 

 

 

 అన్ని  ప్రభుత్వ కార్యాలయాలు ఆఫీసులు భవనాలు పంచాయతీ కార్యాలయాలకు కూడా వైసిపి రంగులు వేయడం రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. అయితే దీనిపై ప్రతిపక్ష టిడిపి విమర్శలు గుప్పిస్తూ నే ఉంది. జగన్ ప్రభుత్వానికి ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం లో ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో లేదు అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. అంతే కాకుండా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రంగులు వివాదం కొనసాగుతూనే ఉంది. గ్రామ పంచాయతీ కార్యాలయాలకు కూడా వైసిపి పార్టీ జెండా రంగులు వేశారు అంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. అనంతపురం జిల్లాలో ఏకంగా జాతీయ జెండాను కూడా చెరిపి  వైసిపి రంగులు వేయడం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. 

 

 

 

 అయితే ఈ విషయంలో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని  మళ్ళీ  జాతీయ జెండా రంగులు వేయించారు . అయితే తాజాగా వైసీపీ  రంగులకు సంబంధించి మరో ఫోటో వైరల్ గా మారింది. స్మశానం లో ఉన్న ఓ సమాధికి ఓ వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రంగులను వేస్తుండడంతో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే సమాధికి వేసిన వైసిపి రంగులతోపాటు సమాధి పక్కనే ఒక వ్యక్తి పెయింటింగ్ వేస్తూ  కూడా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ ఫోటో ఎక్కడిది... ఈ ఫోటో నిజమేనా... మార్ఫింగ్ చేశారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: