కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఎంఎంటీఎస్ రైలు లోకో పైలట్ నిర్లక్ష్యం వలన ఎక్స్ ప్రెస్ రైలునుఢీ కొట్టిన విషయం తెలిసిందే.ఈ ఘటన మరవక ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఏర్కేడు దగ్గర రైలు చక్రం విరగటంతో కేరళ ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో రైలులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. 
 
ఢిల్లీ నుండి త్రివేండ్రం వెళుతున్న కేరళ ఎక్స్ ప్రెస్ ఏర్పేడు వద్దకు వచ్చిన వెంటనే భారీ శబ్దంతో చక్రం విరగటంతో ఆగిపోయింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక బోగీలోని ఒక చక్రం విరిగి రైలు పట్టాలు తప్పటంతో లోకో పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. లోకో పైలట్ అప్రమత్తం కాకపోయి ఉంటే మాత్రం పెను ప్రమాదమే జరిగి ఉండేదని సమాచారం. 
 
ఈ ఘటన జరిగిన సమయంలో భారీ శబ్దం రావటంతో రైలులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారని తెలుస్తోంది. ఏసీ బోగీకు చక్రం విరిగిపోయి పట్టాల నుండి పక్కకు పడిపోయింది. ప్రస్తుతం రైల్వే సిబ్బంది తగిన సహాయక చర్యలు చేపడుతున్నారు. ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవటంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
కొద్దిరోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎక్స్ ప్రెస్ రైలు విరిగిన పట్టాపై వెళ్లింది. అప్రమత్తమైన లోకో పైలట్ వెంటనే రైలును ఆపివేయటంతో పెను ప్రమాదం తప్పింది. రెండు తెలుగు రాష్టాల్లో వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతూ ఉండటం రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తోంది. రైళ్లలో ప్రయాణించాలంటే ప్రయాణికులు ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరమ్మత్తులు పూర్తయిన తరువాత కేరళ ఎక్స్ ప్రెస్ రైలును పంపిస్తారని సమాచారం అందుతోంది. రైల్వే శాఖ రైలు ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొవాలని ప్రజలు కోరుకుంటున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: