ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ నాయకుల మధ్య తిట్ల దండకం పరాకాష్ట కు చేరుకుంది . నువ్వు ఒక్కటంటే ... నేను రెండు అంటానన్నట్లు గా ఇరు పార్టీల నేతలు వ్యవహరిస్తున్నారు . తాజాగా మంత్రి కొడాలినాని చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే రాజకీయాల్లో గతంలో ఉన్న హుందాతనం ఇప్పుడు మచ్చుకైనా కన్పించడం లేదని స్పష్టం అవుతోంది .  సన్నబియ్యం ఇస్తానని చెప్పానని మాజీ మంత్రి దేవినేని ఉమ అంటున్నాడని, ఎవరిదగ్గర చెప్పాను ...  నీ అమ్మ మొగుడు దగ్గర చెప్పానా? అంటూ కొడాలినాని ప్రశ్నించిన తీరు ఎవరినైనా ఇట్టే విస్మయానికి గురి చేస్తోంది .


  సన్నబియ్యం ఇస్తామని, నాణ్యమైన బియ్యం ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించామని , నాణ్యమైన బియ్యం ఇవ్వాలంటే ధాన్యం కొనాలన్న కొడాలినాని , తాము మే 30 తేదీన అధికారంలోకి వచ్చామన్నారు .ఈనెల 20 వతేదీనుంచి ధాన్యం అందుబాటులోకి వస్తుందని , మేం వాటిని తీసుకుని  క్వాలిటిగా ఉన్నవాటిని బ్యాగుల ద్వారా ఏప్రిల్‌ నుంచి ప్రజలకు అందిస్తామని ముఖ్యమంత్రి  జగన్‌ మోహన్ రెడ్డి  చెప్పారన్నారు . శాంపిల్‌ గా ఈ యధవలు చంద్రబాబు,ఉమ,ఈ బొచ్చు బోషాణం  గాళ్లు రీసైక్లింగ్‌ లో కొన్న బియ్యం మా వద్ద స్టాక్‌ ఉందని , అవి తింటానికి పనికిరావని , వాటిలో మంచి బియ్యాన్ని ఏరితే ఒక జిల్లాకు సరిపోతుంటే ... వాటిని శ్రీకాకుళం జిల్లాకు ఇస్తున్నామని చెప్పారు .


మామను చంపిన లుచ్చాగాడు చంద్రబాబు,వదినను చంపిన లుచ్చాగాడు దేవినేని ఉమా , ఈ  ఇద్దరు లుచ్చాలు కలసి నన్ను అడుగుతారా?, ఐదునెలల్లో సన్నబియ్యం ఇస్తానని చెప్పానా?నీ అమ్మ మొగుడికి చెప్పానా?వళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు మాట్లాడేటప్పుడు అంటూ ఉమా ను కొడాలినాని  హెచ్చరించిన తీరు పట్ల విస్మయం వ్యక్తం అవుతోంది . 


మరింత సమాచారం తెలుసుకోండి: