టాలీవుడ్ అగ్రకథానాయకుడు  ఎన్టీఆర్ కు ఆయన స్నేహితులైన ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలినాని , గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ లు మేలు చేస్తున్నారా ?, కీడు చేస్తున్నారా ? అన్నది అంతుచిక్కడం లేదన్న వాదనలు విన్పిస్తున్నాయి . జూనియర్ ఎన్టీఆర్ గతంలో టీడీపీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెల్సిందే . బాలయ్య క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టిన తరువాత  , టీడీపీ నాయకత్వం తో ఎన్టీఆర్ కు విబేధాలు తలెత్తడం ఆయనకు రాజకీయాలకు దూరంగా ఉంటూ , తన సినిమా కెరీర్ పై దృష్టి సారించారు .


ఇక కొడాలినాని టీడీపీ ని వీడి వైకాపా లో చేరేటప్పుడు అయన వెనుక జూనియర్ ఉన్నారన్న ఊహాగానాలు విన్పించాయి . టీడీపీ నాయకత్వం తో విభేదించిన ఎన్టీఆర్ , తన స్నేహితుడైన నానిని వైకాపా లోకి పంపుతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది .  టీడీపీ కి వ్యతిరేకినంటూ తనపై  జరుగుతున్న ప్రచారాన్ని విధిలేని పరిస్థితుల్లో మీడియా ముందుకు వచ్చి జూనియర్ ఖండించాల్సి వచ్చింది . తన ప్రాణం ఉన్నంతవరకు టీడీపీ లోనే కొనసాగుతానంటూ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశాడు . అయితే అప్పట్లో ఆ వివాదం సద్దుమణిగిన జూనియర్ కు , పార్టీ నాయకత్వానికి మధ్య గ్యాప్ మాత్రం రోజుకింత పెరుగుతూ వచ్చింది .


ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు జూనియర్ మామ నార్నె శ్రీనివాసరావు కూడా వైకాపా లో చేరడం వెనుక జూనియర్ హస్తముందన్న ఊహాగానాలు వినిపించినప్పటికీ , ఎన్నికల హడావుడి లో ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు . ఇక తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్ టీడీపీ కి రాజీనామా చేసి జగన్ వెంట నడుస్తానని పేర్కొనడమే కాకుండా,  గతం లో జూనియర్ కు టీడీపీ నాయకత్వం  చేసిన  అన్యాయాన్ని ఏకరువు పెట్టారు . వంశీ రాగాన్ని కొడాలినాని అందుకోవడంతో వీరిద్దరి వెనుక జూనియర్ ఉండి మాట్లాడిస్తున్నారని అనుమానాలను టీడీపీ అనుకూల మీడియా వ్యక్తం చేస్తోంది .. 


మరింత సమాచారం తెలుసుకోండి: