పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి మొదలు కాబోతున్నాయి. ఈ సమావేశాల తరువాత ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. జూన్లో జరిగిన బడ్జెట్ సమావేశాల తరువాత మళ్ళీ ఏపీ  అసెంబ్లీ సమావేశం కాలేదు, నిజానికి ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల మూడవ వారం నుంచి నిర్వహిద్దామని జగన్ భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల డిసెంబర్ కి మారింది. మొడటి వారంలో  సమావేశాలు ఉంటాయి.


ఈ సమావేశాల్లో కూడా జగన్ అనేక కొత్త చట్టాలను తీసుకువస్తారని భావిస్తున్నారు. ప్రధానంగా అక్రమ ఇసుకపై చట్టం, వచ్చే ఏడాది నుంచి ఆగ్ల బోధన వంటివి ముఖ్యమైనవి. ఆ సంగతి అలా ఉంచితే ఈసారి సమావేశాలో రాజకీయ పరిణామాలు చాలా మారుతాయని అంటున్నారు. టీడీపీకి గత సమావేశాలో 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈసారి 22కి ఆ సంఖ్య పడిపోయింది. ఎమెల్యే వాల్లభనేని వంశీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు, ఆయన టీడీపీకి గుడ్ బై కొట్టారు. ఇక ఆయన తరువాత ఎంతమంది పార్టీని వీడుతారన్నది టీడీపీలో టెన్షన్ గా ఉంది. ఈ సమావేశాలోనే తమ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రవేశిస్తారని కొద్ది రోజుల క్రితం బీజేపీ శాస‌న మండలి సభ్యుడు సోము వీర్రాజు ప్రకటించారు. నోటా కంటే  తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా నెగ్గలేదు.


మరి ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రవేశించడం ఏంటి అన్నది పెద్ద ప్రశ్న. అయితే బీజేపీ టీడీపీకి గేలం వేస్తున్న సంగతి విధితమే. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లాంటి వారు బీజేపీలో చేరేందుకు సిధ్ధంగా ఉన్నారని అంటున్నారు. వారంతా ఒక గ్రూప్ గా ఏర్పడితే మాత్రం టీడీపీలో నిలువునా చీలిక వస్తుంది. ఆ విధంగా ఏపీ అసెంబ్లీలో బీజేపీ మళ్ళీ అవతరించే అవకాశలు ఉన్నాయి. అదే జరిగితే బాబు విపక్ష స్థానం కూడా గల్లంతు అవుతుంది. దీంతో బాబు కు ఆయన పార్టీకి  డిసెంబర్ టెన్షన్ పట్టుకుంది. ఆ నెల ఎలాంటి  షాక్ ఇస్తుందోనని హడలిపోతున్నారు. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: