గత ఎన్నికల్లో టీడీపీ- జనసేన లోపాయకారీగా సహకరించుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. మంగళగిరిలో జనసేన పోటీ చేయకపోవడం.. విశాఖలో టీడీపీ బలమైన అభ్యర్థిని పెట్టకపోడవం వంటి ఆ రెండు పార్టీల అవగాహనను బయటపెడుతున్నాయని నిన్న మొన్నటి వరకూ ఆంధ్రాప్రజ చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఈ రెండు పార్టీల అంతర్గత విషయాలు వెలుగు చూస్తున్నాయి.


ఇటీవల టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ రహస్యాలు వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. గన్నవరంలో పవన్ సీపీఐ అభ్యర్థిని పోటీకి దింపింది చంద్రబాబు ఆదేశాల మేరకే అని కూడా వంశీ అంతఃపుర రహస్యాలు బయటపెట్టాడని విజయ సాయి రెడ్డి వివరించారు. ఆఖరికి జనసేన అభ్యర్థుల బి-ఫారాలు సైతం టీడీపీ ద్వారానే వెళ్లినట్టు తెలిసిందని విజయ సాయి రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకు కీలకమైన స్థానాల్లో జనసేన డమ్మీ అభ్యర్థులను బరిలో నిలిపిందన్న విషయాన్ని వంశీ వెల్లడించాడని విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.ఏపీలో కొన్నిరోజలుగా ఇసుక రాజకీయం సాగుతోంది. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులతో పాటు అనేక రంగాల కార్మికులు పస్తులు ఉంటున్నారని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి.


అయితే భవన నిర్మాణ కార్మికులకు నిజంగానే ఉపాధి పోయిందో లేదో తెలియదు కానీ, బాబుకు ఆయన భాగస్వామికి చేతినిండా పని దొరికిందని సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రాంగ్ మార్చ్, ఒక్క పూట దీక్షల కోసం చేసిన ఖర్చుతో కనీసం 1000 కుటుంబాలు ఏడాదిపాటు జీవిస్తాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారని తెలిపారు. దీనికి తోడు టీడీపీ, బీజేపీ మధ్య రాయబారం నడిపేందుకే పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లాడని వస్తున్న విశ్లేషణలు ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నాయని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: