ఏపీ సీఎం జగన్ పాలనకు కొత్తయినా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఆర్థికంగా రాష్ట్రం పరిస్థితి అంతగా బాగాలేదని వార్తలు వస్తున్నా.. సంక్షేమం మాత్రం జోరు తగ్గడం లేదు. అయితే.. ప్రభుత్వాన్ని, సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేక చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్న ఆరోపణలున్నాయి.


జగన్ ను అడ్డుకోవాలంటే.. ఇక మతం ఒక్కటే ప్రధాన అంశమని జగన్ రాజకీయ ప్రత్యర్థులు భావిస్తున్నట్టు ఆరోపణలు వన్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్యమత ప్రచారం అంటూ చేస్తున్న ఆరోపణలపై పాట్నర్స్‌ ఇద్దరూ చర్చకు సిద్ధమా అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సవాలు విసిరారు. బోడిగుండుకు మోకాలుకు ముడిపెట్టే విధంగా ఎక్కడా పొంతన లేకుండా వీరిద్దరూ మాట్లాడుతున్నారని, బ్రిటీష్‌ వారు విభజించి పాలించు పాలసీని నల్ల దొరలు చంద్రబాబు, పవన్‌లు అనుసరిస్తున్నారన్నారు. హిందూ దేవాలయాలు, అర్చకుల అభివృద్ధికి రూ. 234 కోట్లు మొదటి బడ్జెట్‌లో కేటాయించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది అని గుర్తుచేశారు.


సోషల్‌ మీడియాలో, పచ్చ మీడియాలో కావాలని చంద్రబాబు, పవన్‌లు సీఎంపై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు మాట్లాడే చాన్స్‌ కూడా ఇవ్వకుండా ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలన్నీ సీఎం వైయస్‌ జగన్‌ ఐదు నెలల పాలనలోనే అందిస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోవడానికి ఎటువంటి పరిస్థితులు లేకపోవడంతో సున్నితమైన మతపరమైన అంశాలను తెర మీదకు తెచ్చి ప్రభుత్వంపై, వైయస్‌ జగన్‌పై బురదజల్లేందుకు చంద్రబాబు, పవన్, ఇతర రాజకీయ పార్టీలు ఆరోపలు చేస్తున్నాయి.


నవరత్నాలు అమలు చేస్తూ.. మొదటి కేబినెట్‌ మీటింగ్, అసెంబ్లీ మీటింగ్‌లో 19 బిల్లులు తీసుకువచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ప పాలన గురించి తెలుసుకొని ఇతర రాష్ట్రాలు మన రాష్ట్రంవైపు చూస్తున్నాయి. అటువంటి తరుణంలో సీఎం వైయస్‌ జగన్‌ను ఎదుర్కోలేమని వంకతో 40 ఏళ్ల ఇండస్ట్రీ, వారి పాట్నర్‌ పవన్‌ మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: