ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి నల్లధనంపై గురిపెట్టబోతున్నారు. గడచిన ఐదేళ్లలో నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పలు నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీ ఆస్తులతో ఆధార్ లింక్ అనే సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారని సమాచారం. ఈ నిర్ణయం అమలులోకి వస్తే ఆస్తులు అన్నీ ఆధార్ నంబర్ తో లింక్ చేయాల్సి ఉంటుంది. 
 
ఇప్పటికే ఆస్తులకు ఆధార్ లింక్ కు సంబంధించిన బిల్లు తుది దశలో ఉందని సమాచారం. ఆస్తులకు ఆధార్ అనుసంధానం వలన పారదర్శకత పెరుగుతుందని ఆధార్ అనుసంధానం వలన బినామీ లావాదేవీలు పూర్తిగా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చట్టం అమలులోకి వస్తే ప్రభుత్వం బినామీలను ఏరిపారేస్తుందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. 
 
ఈ బిల్లు అమలులోకి వస్తే ఎవరి పేరుపై ఆస్తి ఉంటే ఆ ఆస్తికి ఆధార్ నంబర్ లింక్ అవుతుంది. ఒకే ఆధార్ నంబర్ తో భారీ స్థాయిలో ఆస్తులు ఉంటే ఆదాయపు పన్ను శాఖ వారిపై దృష్టి పెడుతుంది. ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన లావాదేవీలన్నీ ఆధార్ నంబర్ ఆధారంగానే జరుగుతాయి. ఆధార్ నంబర్ తో ఆస్తులను లింక్ చేయటం వలన రియల్ ఎస్టేట్ రంగంలో జరిగే అక్రమాలను పూర్తిగా నిర్మూలించవచ్చు. 
 
ఈ బిల్లు అమలులోకి వస్తే బినామీ లావాదేవీలను దాచిపెట్టటం కుదరదు. ఖచ్చితమైన మార్గదర్శకాలు కంపెనీల పేరిట కొన్న ఆస్తుల విషయంలో కూడా ఉంటాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆధార్ నంబర్ ఆధారంగా జరుగుతున్నాయి. మోదీ విచ్చలవిడిగా పెరిగిపోతున్న అవినీతికి అడ్డుకట్ట వేయటం కొరకు ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఆస్తులకు ఆధార్ లింక్ గురించి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే బినామీ పేర్లతో అడ్డగోలుగా ఆస్తులు కొనే వారి వివరాలు సులభంగా తెలుస్తాయి. 




మరింత సమాచారం తెలుసుకోండి: