ఏపీలో కొత్త ప్రభత్వం ఏర్పాటు అయినప్పటి నుండి నిరుద్యోగులకు ఇంతవరకు ఎన్నో శుభవార్తలు చెబుతుంది. చదువుండి, సరైన అర్హతలున్నా ఉద్యోగం లేకుండ ఉన్న వారికి జగన్ ప్రభుత్వం కల్పతరువులా  మారింది. ఇప్పుడు అదేకోవాలో వెళ్లుతూ మరో  తీపికబురు అందించడానికి రెడి అయ్యింది. అదేమంటే పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది.


ఈ మేరకు శనివారం అంటే నవంబరు 16న మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలచేయగా, ఈ ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో జోన్ల వారీగా భర్తీ  భర్తీచేయనున్నారు.. ఇందుకు గాను నవంబరు 29 వరకు ఆన్‌లైన్ ద్వారా సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇకపోతే పూర్తి వివరాలను తెలుసుకుంటే మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు ఖాళీల సంఖ్య మొత్తం 1113.. కాగా సంవత్సరం పాటూ కాంట్రాక్ట్ బేసిక్ వ్యవధి.


ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఎస్సీ(నర్సింగ్) డిగ్రీ అర్హత  కలిగి ఉండాలి. ఇందుకు గాను వయస్సు 35 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 40 సంవత్సరాలలోపు ఉండాలి. ఇకపోతే రూ.300. దరఖాస్తు ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఫీజు నుంచి మినహాయింపు కూడా ఉంది. ఇక ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారికి డిసెంబరు 10న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. 


రాతపరీక్ష ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నామని,  విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఇకపోతే ఉద్యోగాలకు ఎంపికైనవారికి వేతనంగా నెలకు రూ.25,000 అందజేస్తారు. శిక్షణ సమయంలో ఎలాంటి స్టైపెండ్ చెల్లించరు. ఉద్యోగాలకోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 17.11.2019. నాడు మొదలవ్వగా  29.11.2019 వరకు చివరితేదిగా తెలిపారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: