ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుండి ప్రజా సంక్షేమం కొరకు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే. తాజాగా వైసీపీ ప్రభుత్వం ఉచితంగా బైక్స్ ఇవ్వాలని ఆలోచిస్తోందని సమాచారం. మూడు చక్రాల బైకులను అంగవైకల్యం గల వారికి సొంతంగా ఉపాధి చేసుకునేందుకు వీలుగా వైసీపీ ప్రభుత్వం ఇవ్వనుందని తెలుస్తోంది. 
 
అంగవైకల్యం ఉన్నవారు గ్రామవాలంటీర్లకు తమ పూర్తి వివరాలను అందజేయాల్సి ఉంటుంది. గ్రామ వాలంటీర్లు ఇచ్చిన అప్లికేషన్ ను పూర్తి చేసి ఆధార్ కార్డ్, అంగవైకల్యానికి సంబంధించిన సర్టిఫికెట్ అందజేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 2,500 మందికి ఈ బైకులను ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని 22 కోట్ల రూపాయలను ప్రభుత్వం మూడు చక్రాల బైకుల కొరకు ఖర్చు పెడుతోందని తెలుస్తుంది. 
 
గత రెండు రోజుల నుండి పైన పేర్కొన్న విధంగా ఉచిత బైకులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ప్రభుత్వం నుండి అధికారికంగా ఉచిత బైక్ లకు సంబంధించిన నిర్ణయం మాత్రం ఇంకా వెలువడలేదు. ప్రభుత్వం ఉచిత బైకులను సంబంధించిన అంశంపై స్పందించాల్సి ఉంది. ప్రభుత్వం నుండి ఈ పథకం గురించి స్పష్టమైన ఆదేశాలు వస్తే మాత్రమే ఈ పథకం అమలు నిజమో కాదో తెలుస్తుంది. 
 
గతంలో ప్రధానమంత్రి స్కూటీ యోజన పేరుతో సోషల్, వెబ్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఆ తరువాత ఆ వార్తలు అన్నీ నిజం కాదని తేలింది. వైసీపీ ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేసినా అర్హులందరికీ ఆ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకుంటుంది. కానీ వైరల్ అవుతున్న న్యూస్ లో కేవలం 2500 మందికి మాత్రమే ఉచిత బైక్ లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వార్తలు వచ్చాయి. ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందిస్తే మాత్రమే ఈ పథకం గురించి నిజానిజాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: