'అతి గారాబం కటిక దరిద్రం' అంటారు ఒకడే సుపుత్రుడు. పుట్టక ముందు నుండే సార్వం సహా సార్వభౌమాధికారం చలాయిస్తున్న తాత, ఆ తరువాత తండ్రి అంతులే నంత ఐశ్వర్యం దానికి తోడు అధికారం ఇంకేం 'కళ్ళు మసకలు బారగా అధికార మధాందం దేహమంతా ఆవహించితే' ఇంకేముంది  ఆయనే చినబాబు అవుతాడు. 


వల్లభనేని వంశీ మోహన్, జూపూడి ప్రభాకర్, ఇలా ఒకరోకరుగా టీడీపీని వీడిన, వీడుతోన్న నేతల జాబితా చాంతాడంత అవుతుందని అంటున్నారు. అందరి లక్ష్యం నారా లోకేషే. తెలుగుదేశాన్ని వీడుతోన్న నాయక బృందం లోకేష్ లక్ష్యంగా తీవ్ర విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు.  తమలో ఎన్నాళ్ళ నుండో అదిమిపెట్టిన బడబాగ్ని లాంటి ఆక్రోశాన్ని, కసిని భళ్ళున వెళ్లగ్రక్కుతున్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుణ్ణి కొంతవరకు వదిలేసి ఈ చినబాబు పైనే నిప్పరవ్వలు రువ్వుతూ తామూ రగిలిపోతున్నారు. ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. 


దీనికంతటికి కారణం  లోకేష్ అదే చినబాబు అధికారంలో ఉండగా సహచరుల పట్ల ప్రదర్శించిన అహంకారం అధికారదర్పంతో కన్నుమిన్నూ కానని వ్యవహార శైలే  కానీసం పెద్దల పట్ల సైతం - చిన్నాపెద్దా తేడా – చూపకుండా అందరినీ చిత్తానుసారం నారా లోకేష్ అవమానించాడని ముక్తకంఠంతో వినిపిస్తోంది. సహచర మంత్రులనే కాదు, పలు సార్లు ఎన్నికల్లో గెలిచిన శాసనసభ్యులను, అనుభవమున్న నాయకులను, తన తండ్రి సహచరులను, ఎంపీలను, ఎమ్మెల్సీలను లెక్కచేసేవారు కాదంట.


పార్టీలో పెద బాబు తనయుడుగా, సెకండ్ ఇన్ కమాండ్ – రెండవ పవర్ సెంటర్ గా అధికారం వెలగబెడుతూ వ్యవహరించిన లోకేష్, తనను కలవడానికి వచ్చిన ఎవరికీ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా నిష్కారణంగా అవమానించేవారట. వయసులో చిన్నవాడైనా లోకేష్ ను కలిసేందుకు జేసీ దివాకరరెడ్డి లాంటి సీనియర్లు సైతం గంటల తరబడి గది బయట వేచి చూడాల్సి వచ్చేదట. 


అలా, లోకేష్ చేతిలో అవమానాలు ఎదుర్కొన్న నేతలే, ఆయన అధికారాంతమందు చూడవలె అయ్యవారి సౌభాగ్యముల్ అన్నట్లు ఇప్పుడు పార్టీని వీడుతూ తమలో ఇన్నాళ్ళుగా రగులుతున్న కసి కక్ష కార్పణ్యం అంతా వెళ్ళగ్రక్కుతూ ఒక రకంగా వారి ఆత్మ క్షోభను వదిలించుకుంటున్నారని అంటున్నారు.  అయితే పెదబాబు కంటే చినబాబునే లక్ష్యం చేసుకోవటానికి కారణం అధికారంలో ఉండగా లోకేష్ వ్యవహరించిన తీరే! అదే బిహావియర్ మరియు యాటిట్యూడ్. అందుకే పోతూ పోతూ లోకేష్ ను అందరూ చెడుగుడు ఆడుకుంటున్నారని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. 


అధికారంలో ఉండగా లోకేష్ తన పవర్, బిహేవియర్ &  యాటిడ్యూడ్ చూపించాడని, ఇప్పుడు బాల్ వాళ్ల కోర్ట్ లో పడగానే తమ వంతు రాగానే దాన్ని ఎడాపెడా విసురుతూ అత్యంత హీనంగా హేయాతిహేహ్యంగా తిడుతూ తమ ఉక్రోషం తీర్చుకుంటున్నారని అంటున్నారు. వల్లభనేని వంశీ, నారా లోకేష్ ను టార్గెట్ చేయడం వెనుక, ఆయన నుంచి గతంలో ఎదురైన అవమానాలే కారణమనే మాట సర్వత్రా వినిపిస్తోంది. అందుకే, పెదబాబును పక్కనబెట్టి, చినబాబుతో చెడుగుడు ఆడుతున్నారని అంటున్నారు. 


ఉపన్యాసమంతా చంద్రబాబు నాయుడు గారు! అని సంభోదిస్తూ, లోకేష్ టర్న్ రాగానే  “పప్పు... తుప్పు” లాంటి పదజాలంతో చినబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేయటం గమనార్హం. అయితే, ఇది వల్లభనేని వంశీ మోహన్ ఒక్కడి ఆక్రోశమే కాదు, టీడీపీలో చాలా మంది నాయకుల స్వరం కూడా పరుషంగా మరి ఇలాగే ఉందంటున్నారు. "మేం రాజులం... మీరు బానిసలు” అనే లోకేష్ వ్యవహరశైలి , ఎంతటి అనుభవఙ్జుణ్ణైనా పూచికపుల్లతో సమానంగా తీసివేసే యాటిట్యూడ్ ప్రదర్శించే వారని చాలా మంది నేతలు పెదబాబుపై కంటే చినబాబుపైనే ఆగ్రహంగా ఉన్నారని చెప్పుకుంటున్నారు.


అయితే, తెలుగుదేశం పార్టీ పగ్గాలు త్వరలో నారా లోకేష్ కి అప్పగించేందుకు నారా చంద్రబాబు నాయుడు వేదిక సిద్ధంచేస్తున్నారని, అందులో భాగంగా, తెలంగాణాలో కేసీఆర్ తన వారసుడుగా కేటీఆర్ ను ప్రకటించిన తీరున, లోకేష్ పేరును ముందుగా 'టీడీపి వర్కింగ్ ప్రెసిడెంట్' గా ప్రకటించబోతున్నారని పార్టీ నాయకులు కొందరు అనధికారికంగా అంటున్నారు. 


తన తదనంతరం టిడిపిపై లోకేష్ కి పట్టు ఉండాలంటే, హక్కుభుక్తాలు లభించాలంటే ఇప్పట్నుంచే పూర్తి పార్టీ బాధ్యతలు అప్పగించాలని పెదబాబు భావిస్తున్నారట. అయితే, ఇదే పెద్ద సమస్యైంది కొందరికి.  లోకేష్ అదుపాఙ్జల్లో పనిచేయడం ఇష్టంలేని నేతలంతా ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారని, వెళ్తూ వెళ్తూ చినబాబు చేతగాని తనాన్ని, రోడ్డు మీదకు లాగి లాగి గుంజి గుంజి సాగదీసి మరీ వెళ్తున్నారని అంటున్నారు.


అసలు “జయంతికి వర్ధంతి” కి తేడా తెలియని లోకేష్ పార్టీని ఎలా నడిపించగలడన్న వల్లభనేని వంశీ మోహన్ ఘాటైన ఎగతాళి స్వరాన్నే మరికొందరు టీడీపీ నేతలు త్వరలో తమ నోటి నుండి మరీ వినిపించ బోతున్నారనేది జనంలో వినిపిస్తున్న మాట. రానున్న ఈ గడ్డు కాలాన్ని,  పరిస్థితిని 'పప్పు ఉరఫ్ తుప్పు' అనబడే చినబాబు ఎలా ఎదుర్కొంటారో? అన్నది నిరీక్షించి చూడాల్సిన విషయం.
 


మరింత సమాచారం తెలుసుకోండి: