నల్లధనం గుట్టు రట్టు చేస్తా అని అధికారంలోకి  వచ్చినప్పటి నుండి చెబుతున్న నరేంద్రమోదీ ఆ దిశగా పెద్ద నోట్లను రద్దు చేశారు. కాని దాని ఫలితం మిశ్రంగా వచ్చింది. అంతే కాకుండా నేను అవినీతికి పాల్పడను... ఎవరినీ అవినీతికి పాల్పడనివ్వను.. అంటూ అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ.. పై మరోసారి అవినీతిపై గురిపెట్టబోతున్నారు.


ఇక తొలి ఐదేళ్లలో బ్లాక్‌మనీని బయటపెట్టేందుకు పలు కీలక చట్టాలు చేసిన ఆయన.. తాజాగా ‘ఆస్తులకు, ఆధార్‌కు లంకె’ అనే మరో భారీ ఆయుధాన్ని ఇప్పుడు ప్రయోగించబోతున్నారు. ఎందుకంటే నల్లధనం డబ్బు రూపంలో ఉండకుండా.. పెట్టుబడిగా మారి రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి ప్రవహిస్తోంది. దీనివల్ల స్థలాలు, ఇళ్ల ధరలు ఆకాశాన్నంటి పేదలు, మధ్యతరగతి వారు వాటిని కొనలేని పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే అధికారంలోకి రాగానే ఈ రెండు సమస్యలకూ ఒకేసారి చెక్‌ పెట్టే దిశగా చర్యలు మొదలుపెట్టారు మోదీ.


ఇందుకు గాను  ఆస్తులన్నింటినీ ఆధార్‌తో అనుసంధానించడం వల్ల అవినీతి కొంతవరకైన ఆగుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకు సంబంధించిన బిల్లు రూపకల్పన తుది దశలో ఉందట. ఇకపోతే మోదీ ప్రభుత్వానికి ఈ మార్పు కొత్త ఉత్తేజానిచ్చిందట ‘2022 నాటికి అందరికీ ఇళ్ళు’ నినాదంతో ముందుకెళుతున్న దశలో ఇపుడు ఆస్తులన్నింటినీ ఆధార్‌తో అనుసంధానించడం వల్ల బినామీ లావాదేవీలు పూర్తిగా తగ్గుతాయని, పారదర్శకత పెరిగి, అందరికీ ఇళ్లు లభించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం నమ్ముతోంది.


దీనివల్ల.. బినామీ లావీదేవీలను దాచిపెట్టడం కుదరదు. కంపెనీల పేరిట కొన్న ఆస్తుల విషయంలోనూ కచ్చితమైన మార్గదర్శకాలు ఉంటాయి. కంపెనీ చరిత్ర, యాజమాన్యం ట్రాక్‌ రికార్డు.. ఇవన్నీ కూడా పరిగణనలోకి వస్తాయంటున్నారు అధికారులు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో సహా కొన్ని రాష్ట్రాల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఆధార్‌ నంబర్‌ ఆధారంగానే జరుగుతున్నాయని పేర్కొన్నారు.


ఇకపోతే ఈ చట్టం వల్ల ఒకే ఆధార్‌ నంబరుతో పెద్దఎత్తున ఆస్తిని కలిగి ఉండడం అసాధ్యం. ఈ చర్యతో రియల్‌ ఎస్టేట్‌ రంగం నుంచి అక్రమాలను నిర్మూలించడం ఖాయం.. ఇప్పటికే బినామీల పేరిట ఆస్తుల్ని రిజిస్టర్‌ చేసుకున్నవారు వాటిని డిజిన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఇళ్లు కొనుక్కునే వారికి ఇది మరింత భద్రతనిస్తుంది. అక్రమ ఆస్తూల నిర్మూలన జరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: