ఢిల్లీలో గాలి ఎంతగా పొల్యూట్ అయ్యిందో చెప్పక్కర్లేదు.  ఎక్కడ చూసినా పొల్యూషన్ తో నిండిన గాలి కనిపిస్తోంది.  ఈ గాలిని పీల్చుకొని జనాలు ఊరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారు.  శ్వాస సంబంధమైన ఇబ్బందులు పడుతున్నారు.  పొల్యూషన్ ను తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సరి బేసి విధానం తీసుకొచ్చినా పెద్దగా ఉపయోగం ఉండటం లేదు.  పొల్యూషన్ ను తగ్గించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉపయోగం ఉండటం లేదు. 


దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.  ఢిల్లీకి చుట్టుపక్కల ఉండే రాష్ట్రాల్లో పంట వ్యర్ధాలను కాల్చడం వలన.. దాని నుంచి వచ్చే పొగ, దాని నుంచి వెలువడే విష వాయువులతో ఢిల్లీ మొత్తం నిండిపోయింది.  పైగా అక్టోబర్ 27 వ తేదీన జరిగిన దీపావళి తరువాత ఈ విషవాయువుల తాకిడి ఎక్కువైంది.  దీంతో ఢిల్లీ వెళ్ళాలి అంటే జనాలు భయపడిపోయో విధంగా మారిపోయింది.  


స్వచ్ఛమైన గాలి కోసం ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  స్వచ్ఛమైన గాలి దొరికితే దానికోసం ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు.  దీనిని కొన్ని సంస్థలు వినియోగించుకోవడానికి రెడీ అవుతున్నది.  ఇందులో భాగంగా ఢిల్లీలోని సిటీ వాక్ మాల్, సాకేత్ తో ప్యూర్ ఆక్సిజన్ అనే పేరిట కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు.  అక్కడ ప్యూర్ ఆక్సిజన్ ను వివిధ ఫ్లేవర్స్ తో మిక్స్ చేసి అమ్ముతురున్నారు.  


ఈ ప్యూర్ ఆక్సిజన్ ధర రూ. 299 రూపాయల నుంచి మొదలౌతుంది.  వివిధ ఫ్లేవర్స్ ను బట్టి ఈ ధర ఉండబోతున్నది.  ఈ ప్యూర్ ఆక్సిజన్ స్టాల్ కు ఎక్కువ గిరాకీ ఉండటంతో డిసెంబర్ లో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు దగ్గరలో మరో స్టాల్ ను ఏర్పాటు చేయబోతున్నారట.  ఒకప్పుడు నీళ్లను డబ్బాల్లో పోసి అమ్మితే ఇదేంటి అని హేళనగా చూశారు.  ఇప్పుడు నీళ్లు డబ్బాల్లోనే దొరుకుతున్నాయి.  భవిష్యత్తులో గాలి కూడా ఇలానే డబ్బాల్లో కొనుక్కోవలసి వస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: