ఎవరు ఎన్ని చెప్పినా సరే... సోషల్ మీడియాలో టీడీపీ క్యాడర్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటుంది అనేది వాస్తవం. లోకేష్ ఒకసారి గురజాల పర్యటనకు వెళ్తే... అక్కడికి వచ్చిన జనాన్ని చూసి, లోకేష్ ని అక్కడి నుంచి పోటీ చెయ్యాలి అంటున్న గురజాల తెలుగు తమ్ముళ్లు అని ఒక కథనం రాసి ప్రచారం చేసి దానిని లోకేష్ వద్దకు తీసుకువెళ్తే తన సన్నిహితుల వద్ద లోకేష్ చూసి పొంగిపోయారట. ఇక అది పక్కన పెడితే కడప జిల్లాలో కృష్ణా నది నీళ్లు వెళ్తే ఆ దెబ్బకు కడప టీడీపీ ఖిల్లా అవుతుంది అని వ్యాఖ్యానించారు కొందరు తమ్ముళ్లు. చివ‌ర‌కు మొన్న ఎన్నిక‌ల్లో క‌డ‌ప‌లో టీడీపీ అస‌లు ఖాతాయే తెర‌వ‌లేదు.


ఇప్పుడు అనంతపురం జిల్లా విషయానికి వచ్చి చూద్దాం... పరిటాల కుటుంబానికి జెసి కుటుంబానికి ఉన్న విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయంగా వాళ్ళ మధ్య ఉన్న విభేదాల దెబ్బకు ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఈ ఇద్దరు మళ్ళీ కలిసి పని చేసే పరిస్థితి వచ్చింది. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎడమొహం పెడమొహంగా ఉన్న రెండు కుటుంబాలు ఎన్నికల ముందు మాత్రం హడావుడి చేశాయి. పరిటాల శ్రీరామ్, జెసి పవన్ కలిసి ప్రచారం కూడా చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


ఆ ఫోటోలు చూసి హడావుడి చేసింది టీడీపీ సోషల్ మీడియా. అసలు పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈ రెండు కుటుంబాలు కలవడమే అనేది కొందరి వాదన. ఇప్పుడు ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు మళ్ళీ బయటపడ్డాయని కొందరు అంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పరిటాల వర్గం పార్టీకి దూరమైంద‌ని అంటున్నారు. జెసి వర్గం పెత్తనం నచ్చని కొందరు... పార్టీకి రాజీనామా చేయకుండా పక్కకు తప్పుకుంటున్నారని అంటున్నారు. ఇక జెసి వర్గం కూడా... పరిటాల వర్గం తమపై పెత్తనం... చెలాయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని మండలాల్లో పార్టీకి ఇబ్బందిగా మారారని మండిపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: