ఆరో రోజుల క్రితం హైదరాబాద్ కాచిగూడలో రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటనలో తీవ్రంగా గాయపడి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంఎంటీఎస్​ లోకో పైలట్ చంద్రశేఖర్ నిన్న రాత్రి 10 గంటలకు మృతి చెందాడు. నాంపల్లి కేర్ ఆస్పత్రిలో ఆరు రోజులుగా చికిత్స పొందుతున్న చంద్రశేఖర్‌ పరిస్థితీ విషమించడంతో మృతి చెందాడు. 

                                 

చంద్రశేఖర్ మృతి చెందినట్లు కేర్ ఆస్పత్రి వైద్యులు నిర్దారించారు. చంద్రశేఖర్‌ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 11వ తేదీ ఉదయం 10: 45 నిమిషాల సమయంలో కర్నూలు నుంచి కాచిగూడ స్టేషన్‌లోకి వస్తున్న హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్‌ రైలును వేగంగా ఢీకొట్టింది. 

                       

ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎవరికి ఏమి కాకపోయినా ఎంఎంటీఎస్ రైలు లోకో పైలట్ చంద్రశేఖర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాడు. అతనిని బయటకు తీయడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది దాదాపు 8 గంటలు పాటు తీవ్రంగా శ్రమించి చివరికి బయటకు తీశారు. అలా బయటకు తీసే సమాయంలోనే అతని పరిస్థితి విషమంగా ఉంది. 

               

ఎట్టకేలకు తీవ్రగాయాలతో బయట పడ్డ చంద్రశేఖర్‌ను నాంపల్లి కేర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే గత ఆరు రోజుల నుంచి నరకయాతన పడి మృతి చెందిన చంద్రశేఖర్ నిన్నరాత్రి మృతి చెందాడు. చంద్రశేఖర్‌ మృతదేహాన్ని కేర్‌ ఆస్పత్రి వైద్యులు కాచిగూడ రైల్వే పోలీసులకు అప్పగించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం అతని మృతుదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: