మధ్య నిషేధం అనేది ఇప్పటి వరకు చాలా ప్రభుత్వాలు ప్రకటించిన ఆచరణలో విఫలం అయ్యాయి. అయితే ఏపీ సీఎం జగన్ దశల వారీగా మధ్యాన్ని నిషేధం చేస్తానని ఇప్పుడు ఆ దిశగా కార్యచరణ కూడా మొదలైంది. అయితే పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పుడు మధ్యం ఏపీకి సరఫరా అవ్వడం ఏపీ సర్కార్ కు తలనొప్పిగా మారింది. ఆర్థిక మాంద్యమొచ్చినా.. అంతకంటే కరువు కకావికలం చేసినా సాయంత్రం అయితే మందుబాబుల నాలుక మాత్రం లాగేస్తుంటుంది. చుక్కలేనిదే చుక్కలు చూపిస్తారు. మద్యం తాగకపోతే గిలాగిలా కొట్టేసుకుంటారు. కానీ ఏపీలో మద్యం ధరలు పెరగడం.. రాత్రి 8 గంటలకే మూతపడుతుండడంతో పొద్దంతా పనిచేసొచ్చి  రాత్రిళ్లు తాగే మందుబాబులు ఇప్పుడు గిలాగిలా కొట్టుకుంటున్నారు.


అయితే తెలంగాణలో మధ్యం పై ఎటువంటి నిషేధం లేకపోవటంతో ఇప్పుడు అందరూ తెలంగాణ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రత్యామ్మాయంగా ఇప్పుడు తెలంగాణ బార్లు వైన్స్ షాపులకు క్యూ కడుతున్నారు.ఇప్పుడు తెలంగాణ మద్యం ఏపీలో కిక్కిస్తోంది. ఏపీ సరిహద్దుకు ఆనుకొని ఉన్న ఖమ్మం నల్గొండ జిల్లాల  వైన్స్ బార్ల పంట పండుతోందట.. ఏపీలో మద్యం ధరలకు తెలంగాణలో మధ్య ధరలకు క్వార్టర్ కు రూ.30-40 తేడా ఉంటోంది. ఇక ఫుల్ బాటిల్ కు అయితే ఏకంగా 150-200 వరకూ తేడా ఉంది. దీంతో తెలంగాణలో చీప్ గా దొరికే మద్యం కోసం ఏపీ సరిహద్దున గల మందుబాబులు ఎగబడుతున్నారు.


తెలంగాణకు సరిహద్దుగా ఉన్న జిల్లాల నుంచి ఇప్పుడు ఏపీకి మద్యం బారులై వస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకొని ఉన్న కృష్ణ జిల్లాలోని జగ్గయ్యపేట వత్సవాయి పెనుగంచిప్రోలు నందిగామ వీరులపాడు మండలాల వాసులంతా తెలంగాణ మద్యం షాపులకు క్యూ కడుతున్నారు. ఇక్కడ రాత్రి 11 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉండడం.. పైగా ఏపీతో పోలిస్తే తక్కువ ధరకు మద్యం దొరకడంతో తెలంగాణ సరిహద్దు గ్రామాలకు వచ్చి మరీ కొనుక్కెళుతున్నారట.. ఇక కొందరు భారీగా మద్యం కొనుక్కొని బెల్ట్ షాపుల ద్వారా జనానికి అమ్ముకుంటూ సొమ్ముచేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: