తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుస భవిష్యత్తు కార్యాచరణలు  ప్రకటిస్తు  తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మెను ఉధృతం చేస్తున్నారు. ఇక తెలంగాణ ఆర్టీసీ జేఏసీ  తెలుపుతున్న నిరసనలతో రాష్ట్రంలో పలు ఉద్రిక్త పరిస్థితులకు కూడా దారితీస్తున్నాయి.  ఇప్పటికే సమ్మె మొదలై 44 రోజులకు  చేరుకున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం విషయంలో మాత్రం సానుకూలంగా స్పందించలేదు. అటు కార్మికులు కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 44వ రోజుకు చేరుకోవడంతో ఆర్టీసీ సమ్మె భవితవ్యం ఏంటి అన్నది ప్రస్తుతం తెలంగాణలో ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇప్పటికే గత రెండు నెలల నుంచి జీతాలు అందక ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కుటుంబ పోషణ భారమై ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు . 

 

 

 

 ఆర్టీసీ సమ్మె పై హైకోర్టులో విచారణ మీద విచారణ జరుగుతున్న కూడా హైకోర్టు ఆర్టీసీ  పై విచారణ  కూడా ఓ  కొలిక్కి రాలేదు.ఇక  మరోసారి ఆర్టీసి సమ్మె పై హైకోర్టులో రేపు విచారణ జరగనుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ తమ భవిష్యత్ కార్యాచరణ లో భాగంగా నిన్న నిరాహారదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి నిరాహార దీక్ష చేయకుండా గృహనిర్బంధం చేయడంతో ఆర్టీసీ కార్మికులు అందరూ అశ్వద్ధామ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. దింతో  అశ్వద్ధామ రెడ్డి ఇంటి వద్దనె  దీక్షను ప్రారంభించారు. అయితే ఇప్పటికే ఆర్టీసీ సమ్మెకు తెలంగాణ జన సమితి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలుపుతున్న విషయం తెలుసా. 

 

 

 అయితే ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలుపుతున్న తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా దీక్ష చేపట్టనునట్లు తెలియవచ్చింది. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిరవధిక దీక్ష చేపట్టాలని టీజేఏసీ నేతలు కోదండరాం కోరినట్టు సమాచారం. అయితే దీనిపై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని  సమాచారం. కాగా  ఈ నెల 19న సడక్ బంద్లో పాల్గొనాలని అందుకు అన్ని వర్గాలను సమాయత్తం చేయాలని కోదండర భావిస్తుంన్నారట . ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ప్రగతి భవన్ కూడా ముట్టడించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు టీజేఏసీ నేతలు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: