ముఖ్యమంత్రిగా జగన్ ఆరు నెలల పాలన పూర్తి చేసుకున్నారు. ఆయన మొదటి రోజు నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఏపీ లోటు రాష్ట్రంగా ఉంది. అయినా సరే అడిగిన వారికి కాదనకుండా వరాలు ఇస్తున్నారు. తాను పాదయాత్రలో ఇచ్చిన హామీలను తుచ తప్పకుండా జగన్ అమలు చేస్తున్నారు.  ఓ వైపు  ఏపీకి నిధులు పెద్దగా లేవు, అయినా జగన్ ఎక్కడా తగ్గడంలేదు.


మరి ఇవన్నీ చూసినపుడు జగన్ సాహసిగానే కనిపిస్తారు, కనిపించాలి కూడా. కానీ జరుగుతున్నది వేరుగా ఉంది. జగన్ మీద ఒకటి రెండు సమస్యలు తీసుకుని ఏపీలోని విపక్షం బురద జల్లుతూంటే  దానిని టీడీపీ జాతి మీడియా కూడా  హైలెట్ చేస్తోంది. పోనీ ఏపీ వరకూ ఈ పరిస్థితి ఉంది అంటే సరేననుకోవచ్చు. కానీ ఏకంగా అది జాతీయ మీడియా వరకూ పాకింది. ఇపుడు అదే విడ్డూరం. జగన్ మీద ఓ జాతీయ పత్రిక ఏకంగా ఘోరంగా ఆర్టికల్ రాసేసింది. జగన్ పాలనంతా కూల్చుడేనని కూడా ఆరోపించింది. అచ్చం టీడీపీ అధినేత చేస్తున్న ఆరోపణలే ఆ పత్రిక ఆర్టికల్ గా మారడం విశేషం. ఇక  మరో జాతీయ పత్రికలో జగన్ తన రెండు కాళ్లకు ఇసుక బస్తాలను వేసుకుని నడవడానికి ఇబ్బంది పడుతున్నట్లుగా కార్టూన్లు వేసింది.



వీటిని ఒకే రోజు పవన్, చంద్రబాబు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయడంతో ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారుట. జాతీయ మీడియాను అనుసంధానం చేసే కీలకమైన బాధ్యతలను దేవులపల్లి అమర్ కి అప్పగిస్తూ ఆయనకు ప్రభుత్వంలో కీలమైన పదవిని కూడా ఇచ్చారు. మరి జాతీయ మీడియాలో ఇలా నెగిటివ్ న్యూస్ రావడమేంటని జగన్ ఆయన్ని అడిగారని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే జగన్ ప్రతిపక్షంలో ఉండగా ఆయన్ని ఎత్తి రాసిన జాతీయ మీడియా ఇపుడు రివర్స్ కౌంటర్లు వేయడానికి కారణాలేంటో కూడా వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నారుట. టీడీపీ అధికారంలో ఉన్న టైంలో మీడియాని మ్యానేజ్ చేసే బాధ్యత కోసం ప్రత్యేకంగా ఢిల్లీలో  ఒక ఓస్డీని నియమించారుట. ఇపుడు జగన్ నియమించిన దేవులపల్లి  అమర్ అమరావతి కేంద్రంగా పనిచేయడం వల్ల సరిగ్గా వారితో ఇంటరాక్ట్ కాలేకపోతున్నారని అంటున్నారు. మరి చూడాలి జగన్ జాతీయ మీడియాను అట్రాక్ట్ చేసేందుకు ఏం చేస్తారో మరి. ఏది ఏమైనా మెజారిటీ జాతీయ మీడియా ఇప్పటికీ టీడీపీ కంట్రోల్లో ఉండడం విశేషమే



మరింత సమాచారం తెలుసుకోండి: