2014 బ్యాచ్‌లో ఎస్సైగా బి.రామకృష్ణ  ఉద్యోగం పొందారు.ఆయన పెద్దాపురం, కాకినాడ పోర్టు స్టేషన్లలో పనిచేశారు  .. గొల్లప్రోలుకు 2017 లో జనవరి 17న  బదిలీపై వచ్చారు.  ఈయనను ఒక పోలీసు ఉన్నతాధికారి ప్రోద్భలంతో  ఇక్కడికి చేయించారు. ఈయన అన్నిట్లోనూ బేరసారాలకు దిగేవారన్న ఆరోపణలు ఉన్నాయి. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నుంచి పేకాట, రోడ్డు ప్రమాదాలు వరకు ప్రతి కేసులోనూ చేతులు తడపాల్సివచ్చేదట. చివరకు కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలు వంటి సివిల్‌ వివారాల్లో కూడా తలదూర్చి డబ్బు వసూళ్లకు పాల్పడేవాడని ఇప్పుడు పలువురు చెబుతున్నారు. ఇటీవల చెందుర్తి, వన్నెపూడి, కొడవలి గ్రామాల్లో భార్యాభర్తలు, ప్రేమ వ్యవహారాల్లో నమోదైన కేసులో ఇరువర్గాలను రాజీ పెట్టి మామూళ్లు వసూళ్లు చేసినట్లు బాధితులు తెలిపారు. వన్నెపూడిలో పురుగు మందు తాగిన కేసులో రూ.30 వేల వరకు వసూలు చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల  ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రత్తిపాడు జంక్షన్‌లో వ్యక్తి మృతి చెందిన ఘటనలో బస్సు విడుదల చేయడానికి రూ.30 వేల వరకు వసూలు చేసినట్టు ఆరోపణ వచ్చింది.


పేకాడుతున్న వారి వద్ద దొరికిన మొత్తం సొమ్ములో నామమాత్రపు మొత్తం చూపుతూ నమోదు చేసిన సంఘటనలు నిత్యకృత్యం. గొల్లప్రోలులో రెండు పేకాట శిబిరాలు, మల్లవరంలో కోడిపందేల నిర్వహణకు ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీపావళి పండగకు బాణసంచా దుకాణాలకు అనుమతి ఇవ్వడానికి రూ.3 లక్షల మేర వసూలు చేసినట్టు  వెల్లడైంది. హైవేపై చీకటి వ్యాపారాల నుంచి ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణ. స్థానిక కొత్తపేటలో గోడ తగాదా విషయంలో కేసు రాజీకి రూ.20 వేలు, ఎస్సీపేటలో ఒక కేసుకు రూ.10 వేలు తీసుకున్నారని బాధితులు చెబుతున్నారు.

స్టేషను బెయిల్‌ విషయంలో కేసును బట్టి రూ.5 వేల నుంచి రూ.20 వేలు వరకు వసూలు చేసేవారట. ఇటీవల గొల్లప్రోలులోని కొత్తపేటలో పేకాట కేసులో పట్టుబడ్డ 9 మంది నుంచి రూ.27 వేలు వసూలు చేసి, దానిని పెట్టీ కేసుగా మార్చారన్న ఆరోపణ ఉంది.ఏవిధంగా ప్రతి విషయంలోనూ లంచం తీసుకుంటూ దొరికిన రామచంద్రకి ఎటువంటి శిక్ష పడుతుందో చూడాలి .


ఏసీబీ దాడుల్లో లంచం తీసుకుంటూ దొరికిపోయిన గొల్లప్రోలు ఎస్సై బి.రామకృష్ణ, కానిస్టేబుల్‌ సింహాచలానికి ఈ నెల 29వ తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. దీంతో ఏసీబీ అధికారులు నిందితులను రాజమండ్రి ఏసీబీ కోర్టులో శనివారం హాజరుపరిచారు. వారిద్దరికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. దీంతో నిందితులను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించినట్టు ఆయన తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: