తాజాగా పోర్చుగల్‌ రాజధాని లిస్బన్‌లో తల లేని శిశువుకు  జన్మ నివ్వడం జరిగింది. అయితే, ఆ చిన్నారి మరెన్నో గంటలు బతకదని వైద్యులు తెగేసి చెప్పడం జరిగింది. అసలు వివరాల్లోకి వెళ్తే తలకు ఆదారమైన పుర్రె లేకుండా పుట్టిన ఆ శిశువుకు కళ్లు కూడా ఏర్పడలేదని, చెవులు, ముక్కు లేకపోవడంతో శరీరం భాగంలోని అస్పష్టంగా ఉన్న నోటి నుంచి శ్వాస పీల్చుకుంటోందని పోర్చుగల్ పత్రికలు, వెబ్‌సైట్లు ప్రచారం చేయడం జరిగింది.


పూర్తి వివరాలు చూద్దామా మరి.... లిస్బాన్‌లో నివసిస్తున్న మార్లెనే సిమావో, డెవిడ్ రిబైరో‌లకు పుట్టిన ఈ శిశువుకు రోడ్రిగో అని పేరు పెట్టడం జరిగింది. శిశువు గర్భంతో ఉన్నప్పుడు తల్లి మార్లెనే స్కానింగ్‌, అల్ట్రా సౌండ్ టెస్టులు చేయించు కోవడం జరిగింది. కానీ  శిశువులో ఉన్న ఈ సమస్యలను గుర్తించ లేకపోయారు. ప్రసవానికి కొద్ది రోజుల ముందు తీయించుకున్న 5డీ స్కానింగ్‌లో మాత్రమే ఈ సమస్యలు అన్ని కూడా బయటికి రావడం జరిగింది. అయితే, అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. ఈ సమాచారం పత్రికల ద్వారా తెలుసుకున్న ప్రభుత్వం వారు పరీక్షలు చేయించుకున్న నాలుగు స్కానింగ్ కేంద్రాలపై ఆరు నెలలు నిషేదం విధించడం జరిగింది. ఇక ఈ సంఘటనపై విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించడం కూడా జరిగింది.


ప్రస్తుతం ఆ శిశువు పరిస్థితి ఎలా ఉందనే విషయం గురించి ఎటువంటి సమాచారం లేదు. ఆ శిశువు కొన్ని గంటలే నివసిస్తాడని, హాస్పిటల్‌లో తమ ఆధీనంలో ఉంచాలని వైద్యులు తెలియచేయడం జరిగింది. అయితే, ఆ బిడ్డ తల్లిదండ్రులు మాత్రం బిడ్డను తమతోనే తీసుకెళ్తామని, తుదిశ్వాస వరకు ఆ బిడ్డ తమతోనే ఉంచుకుంటాము అని చెప్తున్నారు. దీంతో ఆ శిశువును ఇంటికి తీసుకెళ్లేందుకు వైద్యులు  అంగీకరించడం జరిగింది.

శ్వాస అందించేందుకు ప్రత్యేక సదుపాయం కూడా కల్పించారు వైద్యులు . అలాగే ఎప్పటికప్పుడు ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వైద్యం అందించేందుకు ప్రత్యేకంగా శిశువైద్య నిపుణుల బృందాన్ని కూడా అందుబాటులో ఉంచారు అధికారులు.


మరింత సమాచారం తెలుసుకోండి: