అమ్మాయిల జీవితాల‌తో ఆడుకుంటున్న న‌కిలీ వైద్యుడిని విశాఖ పోలీసులు ఇటీవ‌ల అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ అవతారమెత్తి అమ్మాయిలను ట్రాప్ చేసి పెద్ద మొత్తంలో డ‌బ్బులు గుంజుతున్న  డ్రైవర్ వంకా కుమార్  కేసు ద‌ర్యాప్తును పోలీసులు ముమ్మ‌రం చేశారు.  ద‌ర్యాప్తులో అధికారుల‌కు విస్తుగొలిపే నిజాలు వెల్ల‌డ‌వుతున్నాయి. వంకా కుమార్‌ అమ్మాయిల‌తో చ‌నువుగా ఉన్న ఫొటోలు, వీడియోల‌ను మ‌ణికంఠ అనే వ్య‌క్తి సాయంతో తీయించి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగి బాధితుల వ‌ద్ద నుంచి రూ.ల‌క్ష‌ల్లో గుంజుతున్న‌ట్లుగా పోలీసులు ప్రాథ‌మికంగా గుర్తించారు.  


ఈ మాయ‌గాడి వ‌ల‌లో ఇప్ప‌టికే దాదాపు 20 మంది వ‌ర‌కు  ప‌డిన‌ట్లు తెలుస్తోంది. విశాఖ కంచరపాలెంకు చెందిన వంకా కుమార్ వృత్తిరీత్య‌ డ్రైవర్‌గా ప‌నిచేస్తున్నాడు. అయితే ఈజీ మ‌నికి అల‌వాటు ప‌డిన ఈ మోసగాడు ఓ ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. త‌న‌ను తాను ఓ వైద్యుడిగా ప‌రిచ‌యం చేసుకుని  సోషల్ మీడియా ద్వారా అమ్మాయిల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. 


అమాయ‌క‌త్వంతో మాట్లాడే అమ్మాయిలనే టార్గెట్ చేసుకున్నాడు. తాను ప్రేమిస్తున్న‌ట్లుగా అమ్మాయిల‌ను న‌మ్మించి వారిని డైరెక్ట్‌గా క‌ల‌సి వారితో చ‌నువుగా మెదిలేవాడు. ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్ర‌కారం త‌న స్నేహితుడు మ‌ణికంఠ‌తో ఫొటోలు వీడియోలు తీయించేవాడు. ఆ త‌ర్వాత తాను అడిగినంత డ‌బ్బులు ఇవ్వ‌క‌పోతే ఈ వీడియోలు బ‌య‌ట‌పెడ‌తాన‌ని ఎంతో మంది యువతుల‌ను దోపిడీ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఇటీవ‌ల ఓ  అమ్మాయిని ఇలానే మోసం చేసిన వంకా కుమార్ డ‌బ్బులు ఇవ్వాల‌ని వేధించాడు. 


అయితే ఆ అమ్మాయి ధైర్యం చేసి పోలీసుల‌ను సంప్ర‌దించ‌డంతో పాపం ప‌డింది. పోలీసులు త‌మ‌దైన స్టైల్‌లో విచార‌ణ చేప‌ట్ట‌డంతో మొత్తం విష‌యం క‌క్కేసిన‌ట్లు స‌మాచారం. తాము కూడా కుమార్ చేతిలో మోస‌పోయామ‌ని మ‌రికొంత‌మంది యువతులు పోలీసుల వ‌ద్ద‌కు వెళ్లి వివ‌రాలు చెబుతున్న‌ట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: