విశాఖలో ఒక నకిలీ డాక్టర్ రెచ్చిపోయాడు. మాయమాటలనే ఆయుధాలుగా చేసుకుని ఎంతో మంది అమాయక మహిళల్ని మోసం చేశాడు ఈ ప్రబుద్ధుడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్న ఈయనని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్‌ గా చలామణి అవుతూ, ఎంతోమందిని అమ్మాయిలను ఆ కీచకుడు మోసం చేశాడు. 


      ఫోటోలు, వీడియోలతో బెదిరిస్తూ డబ్బు, బంగారం వసూలు చేశాడు ఈ నీచకడు. బాధను భరించలేక లోపల నలిగిపోతూ ఎంతో మంది ఆ కామాంధుడు చెప్పిన పనులు చేసేవారు. కీచకుడి ఆగడాలను తట్టుకోలేక ఒక బాధితురాలు పోలీసుల ముందు మొరపెట్టుకుంది. స్పందన కార్యక్రమంలో తనకు జరిగిన అన్యాయాన్ని, మోసాన్ని చెప్పుకుని నిందితుడ్ని అరెస్ట్ చేయించింది ఆ యువతి. 


కథ ఇక్కడితో ఆగలేదు, దర్యాప్తులో నిందితుడు చెప్పిన విషయాలు విని పోలీసులే నివ్వెరపోయారు. ఇంతకూ అక్కడేం జరిగిందో తెలుసా, కీచకుడు చేసిన ఆ పాడు పనులు వింటే మీరు కూడా భయపడతారు. విశాఖ కంచరపాలెంకు చెందిన అజిత్ చేసేది డ్రైవర్‌ ఉద్యోగం, ఈజీ మనీకి అలవాటు పడిన అజిత్ కొందరు స్నేహితులతో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. ఫేస్‌బుక్‌‌ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. తాను డాక్టర్‌ అని చెప్పుకుంటూ యువతులతో పరిచయాలు చేసాడు. 


  మాయమాటలు చెప్పి లోబరుచుకునేవాడు. లావుగా ఉన్న మహిళల్నే ఆ దుర్మార్గుడు టార్గెట్ చేసేవాడు. డైటింగ్ పేరుతో వారితో మాట కలిపి ఆ పై నగర శివారు ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్మాయిలపై అత్యాచారం చేసేవాడు. ఆ తర్వాత ఆ తతంగాన్ని మొత్తం వీడియో తీశాడు. ఆ వీడియోలు చూపించి వారిని బ్లాక్‌ మెయిల్ చేసి వారి దగ్గర నుంచి డబ్బు, బంగారం లాక్కునేవాడు. ఇలా దాదాపుగా 17మంది అమ్మాయిల పై ఈ నీచుడు అత్యాచారం చేశానని చెప్పడంతో పోలీసులు సైతం ఖంగుతిన్నారు. ఎట్టకేలకు ఓ బాధితురాలు ఇతడిపై ఫిర్యాదు చేయడంతో ఇతని కీచక పర్వాలన్నీ బయటపడ్డాయి. దీంతో అజిత్‌ పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: