చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఓ వెలుగు వెల‌గాల‌ని ఎన్నో క‌ల‌ల‌తో అడెగుపెట్టిన యువ‌తులు క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తోంది. సినీ తార‌గా గుర్తింపు తెచ్చుకోవ‌డానికి ఒక్క‌ఛాన్స్‌ప్లీజ్ అంటూ ద‌ర్శ‌క నిర్మాత‌ల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఈ ఒక్క‌ఛాన్స్ ప్లీజ్ అనే ప‌దం అవ‌కాశం ఇచ్చే స్థాయిలో ఉన్న‌వారు తమ కొర్కెలు తీర్చుకోవ‌డానికి వాడుకుంటున్న‌ట్లు టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్ ఇలా అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లోని జూనియ‌ర్ ఆర్టిస్టులు క‌న్నీరు మున్నీర‌వుతున్నారు.


ఇంతా చేసినా అవ‌కాశాలు ద‌క్కుతాయ‌న్న న‌మ్మకం కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. క్యాస్టింగ్ కౌచ్ భూతాన్ని ఇప్ప‌టికే నిల‌దొక్కుకున్న తార‌లు సైతం ఎదుర్కొంటున్నారు. అయితే ఎలాగోలా కొన్ని అవ‌కాశాలు వారికి ద‌క్కుతున్నాయ‌న్న వాద‌న‌ను జూనియ‌ర్ ఆర్టిస్టులు వ్య‌క్తం చేస్తున్నారు. న‌ష్ట‌పోయేది ఎటొచ్చి కొత్త‌గా వ‌చ్చేవారు....జూనియ‌ర్ ఆర్టిస్టులుగా ఉన్న అమ్మాయిలేన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వం , సినీ పెద్ద‌లు ఎన్ని చెప్పినా... జ‌ర‌గాల్సిన ఘోరాలు మాత్రం ఆగ‌డం లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 


ఇటీవ‌ల బ‌య‌ట‌ప‌డ్డ ఓ సంఘ‌ట‌న క్యాస్టింగ్ కౌచ్ సినిమా ప‌రిశ్ర‌మ‌ను ఇంకా వెంటాడుతూనే ఉంద‌నే విషయాన్ని బ‌య‌ట‌పెట్టింది. ఓ జూనియ‌ర్ ఆర్టిస్ట్ గ‌ర్భం దాల్చే దాకా వెళ్ల‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది.  హిందీలో ప్రసారమయ్యే పలు రియాల్టీషోలతో ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఆమెకు గత కొంతకాలం క్రితం హర్యానాలోని యమునానగర్‌కు చెందిన ఓ జూనియర్ ఆర్టిస్ట్‌తో పరిచయమైంది.  వీరిద్దరు పలు రియాల్టీ షోల కోసం కలిసి పనిచేశారు. 


అయితే అక్టోబర్ 13న పార్టీ పేరు చెప్పి ఆ ఆర్టిస్ట్ తనను హోటల్‌కు తీస‌ తీసుకువెళ్లాడని, అనంతరం డ్రగ్స్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని స‌ద‌రు జూనియ‌ర్ న‌టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం తాను గర్భవతినని ఫిర్యాదులో పేర్కొంది. అయితే  పెళ్లి చేసుకోవాలని కోరినా తాను నిరాక‌రిస్తున్నాడ‌ని పోలీసుల ఎదుట విల‌పించింది. అయితే ప్ర‌స్తుతం యువకుడు కూడా ప‌రారీలో ఉన్నాడ‌ని నటి తెలిపారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: