సాధారణంగా హెల్మెట్ ధరలు 400 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు ఉంటాయి. కానీ అమెరికా జెట్ ఫైటర్ వాడే హెల్మెట్ ఖరీదు తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. యుద్ధ విమానం ఎఫ్ 35 ప్రపంచంలోనే అత్యంత యుద్ధవిమాన ప్రాజెక్టుగా అరుదైన ఘనత సాధించింది. ఈ ఖరీదైన యుద్ధ విమానంలో ఉపయోగించే హెల్మెట్ ఖరీదు మన రూపాయల్లో 2.8 కోట్ల రూపాయలకు సమానం. 
 
హెల్మెట్ ఖరీదు ఇంత ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా ప్రత్యేకంగా ఈ హెల్మెట్లను తయారు చేస్తారు. ఎఫ్ 35 యుద్ధ విమానాలను నడిపేందుకు ఎంపికైన పైలట్ల శరీరాన్ని, కనుపాపను స్కాన్ చేసి ఈ హెల్మెట్ల సహాయంతో పైలట్లకు రెండు మిల్లీమీటర్ల దూరంలో సమాచారం కనిపించే విధంగా ఏర్పాట్లు చేశారు. అత్యధిక ఎత్తులో అత్యంత వేగంగా ప్రయాణించే యుద్ధ విమానాల్లో పైలట్ల మెదడు, శరీరంపై ఎలాంటి ఒత్తిడి పడకుండా హెల్మెట్ ఉపయోగపడుతుంది. 
 
తుపాకీతో కాల్చినా విమానం కూలిపోయినా ఎటువంటి గాయాలు కాకుండా రక్షణ కవచంలా ఈ హెల్మెట్ ఉపయోగపడుతుంది. ఈ హెల్మెట్ యుద్ధవిమానాల శబ్దాన్ని తగ్గించటంతో పాటు స్పేషియల్ ఆడియో టెక్నాలజీ ద్వారా పైలట్ ఆడియోకు స్పష్టమైన ఆడియో సంకేతాలు వినపడతాయి. ఈ హెల్మెట్ కు ఎక్స్ రే విజన్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ ఎక్స్ రే విజన్ సౌకర్యం ద్వారా చీకటి పడిన సమయంలో కూడా నైట్ విజన్ గాగుల్స్ అవసరం లేకుండా చూడవచ్చు. 
 
ఈ హెల్మెట్ సహాయంతో ఈ యుద్ధవిమానాలతో పాటు ప్రయాణించే ట్యాంకర్ విమానాలు, డ్రోన్లు సహాయ విమానాల నుండి వచ్చే చిత్రాలను కూడా చూడవచ్చు. యుద్ధ విమానానికి అమర్చిన కెమెరాలను కూడా ఈ హెల్మెట్ సహాయంతో నేరుగా చూడవచ్చు. ఎన్నో అధునాతన టెక్నాలజీలను ఉపయోగించి ఈ హెల్మెట్ తయారు చేశారు. యుద్ధ విమానానికి సంబంధించిన కీలకమైన సమాచారం కూడా ఈ హెల్మెట్ లో కనిపిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: