ఎన్నో ఏళ్లుగా హిందూ-ముస్లింల మధ్య నలిగిపోతున్న అయోధ్య సమస్యపై ఇటీవలే సుప్రీ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమిని రామాలయ నిర్మాణానికి ట్రస్టుకు అప్పగించాలని ఆదేశించింది. ఇదే సమయంలో సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదు ఎకరాల ప్రత్మామ్మాయ స్థలాన్ని ప్రభుత్వం ఇవ్వాలని సుప్రీం ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పుపై ముస్లిం సంఘాలకు రివ్యూ చేసే అవకాశాన్ని సుప్రీం కోర్టు కల్పించింది..

.

తాజాగా అయోధ్య విషయంలో సుప్రీం కోర్టు తీర్పుపై రివ్యూకు వెళ్లాలా వద్దా అనే దానిపై లక్నోలో ‘అల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు’(ఏఐఎంపీఎల్ బీ) ఆదివారం సాయంత్రం సమావేశమైంది.. ఎంఐఎం సహా ముస్లిం పార్టీలు సంఘాలు బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ దేశంలోని కీలక ముస్లిం మతపెద్దలు ఈ సమావేశానికి హాజరయ్యారు.  ఏఐఎంపీఎల్ బీ సంచలన నిర్ణయం తీసుకుంది.అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు
అయోధ్యపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలని ఏఐఎంపీఎల్ బీ  నిర్ణయించింది.


ఇక బాబ్రీ మసీదు కోసం ఇవ్వబోయే ఐదు ఎకరాల భూమిని కూడా ఈ ముస్లిం లా బోర్డు నిరాకరించింది.ఇది షరియాత్ విషయమని పేర్కొంది. సమీక్ష పిటిషన్‌ను జమియత్ ఇ ఉలేమా హింద్ దాఖలు చేయనున్నారు....తమకు ఆ భూమి అవసరం లేదని తేల్చిచెప్పింది.  ఈ మేరకు అయోధ్య తీర్పుపై సుప్రీంలో సవాలు చేయాలని ముస్లిం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.అయితే ఇప్పటికే అయోధ్యపై ప్రతివాదులుగా ఉన్న కొన్ని ముస్లిం సంఘాలు  దేశంలోని పలువురు ముస్లింలు ప్రతినిధులు స్వాగతించారు. అయితే ఏఐఎంపీఎల్ బీ మాత్రం రివ్యూ పిటీషన్ కు వెళ్లాలని డిసైడ్ కావడం సంచలనంగా మారింది.


"అయోధ్య సమస్యలో సుప్రీంకోర్టు తీర్పును దేశంలోని ప్రతి ముస్లిం స్వాగతించారు. ఈ రోజు లక్నోలో ఏఐఎంపీఎల్ బీ ఎందుకు సమావేశం నిర్వహిస్తోందో నాకు అర్థం కావడం లేదు. వారు వాతావరణాన్ని పాడుచేయటానికి ప్రయత్నిస్తున్నారు...చివరిసారి కూడా వారు ఒక సమావేశాన్ని నిర్వహించారు లక్నో మరియు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది "అని రాజా అన్నారు. "ఏఐఎంపీఎల్ బీ తో ఎవరూ లేరు. సున్నీ వక్ఫ్ బోర్డు కూడా వారికి మద్దతు ఇవ్వడం లేదు అలాంటి సమావేశాలు నిర్వహించడం మానేయాలి" అని రాజా అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: