మదనపల్లెలో చిన్నారి  వర్షిత కేసులో ప్రధాన నిందితుడు రఫీని పోలీసులు వలపన్ని పట్టుకున్న సంగతి తెలిసిందే.  చిన్నారి వర్షిత కు చాక్లెట్ ఆశ చూపించి కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు.  ఆ సమయంలో ఆ చిన్నారి మరణించింది.  చిన్నారి మరణించిన తరువాత ఆ చిన్నారి శవాన్ని పెళ్లి జరిగే ఇంటి వెనకాల వదిలేసి వెళ్ళిపోయాడు.  తరువాత ఆ చిన్నారిని గుర్తించిన  మున్నీరయ్యారు.  అప్పటి నుంచి నిందితుడి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.  


అలా చిన్నారి మరణానికి కారణమైన వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.  అయితే, చిన్నారి హత్యకు కారణమైన నిందితుడు రఫీని అదుపులోకి తీసుకుం తరువాత అతని గురించిన  బయటకు వస్తున్నాయి.  రఫీ నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని, అతని జీవితం నేరాలతోనే నిండిపోయిందని పోలీసులు చెప్తున్నారు.  రఫీ ఆరో తరగతి చదువుకునే రోజుల్లోనే ఓ చిన్నారిపై హత్యాయత్నం చేశాడు.  


అయితే, తల్లిదండ్రులు పట్టుకొని పోలీసులకు అప్పగిస్తే మూడు నెలలపాటు జైలు జీవితం  వచ్చిన రఫీ అప్పటి నుంచి తన ప్రవర్తనలో కటువుతనం కన్పించింది.  లారీ క్లీనర్ గా జాయిన్ అయిన రఫీకి అనేకమంది మహిళలతో సంబంధాలు ఏర్పడ్డాయి.  అలా మహిళలకు అలవాటు పడ్డ రఫీ.. ఆ తరువాత మదనపల్లెలో ఓ కాలనీలో ఉండే మహిళను కదిలించి చిక్కుల్లో పడ్డాడు.  


ఆ తరువాత తల్లిదండ్రులు రఫీకి పెళ్లి చేశారు.  అయినా మార్పు రాలేదు భార్యను వేధించడంతో, అతని వేధింపులు భరించలేక పుట్టింటికివెళ్ళిపోయింది.  జులాయిగా తిరుగుతూ.. లారీ క్లీనర్ గా పనిచేస్తూ నేరాలకు పాల్పడుతున్నాడు.  ఇప్పుడు చిన్నారి వర్షితపై అత్యాచారం చేసి దొరికిపోయాడు.  పాపతో ఫోటోలు దిగుతూ.. చాక్లెట్ ఇస్తూ.. సరదాగా ఉన్న రఫీ.. చాక్లెట్ పేరుతోనే చిన్నారిపై హత్యాచారం చేసి హత్యచేశాడు. రఫీని బయటకు వదలకూడదని, వాడికి కాళ్ళు చేతులు తీసేసి బయటపడేయాలని, అప్పుడే బుద్ధివస్తుందని అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: