134 సంవత్సరాల అయోధ్య వివాదంపై తీర్పు నవంబర్ 9 వ తేదీన సుప్రీం కోర్టు వెలువరించిన సంగతి తెలిసిందే.  వివాదాస్పదంగా ఉన్న 2.77 ఎకరాల భూమిని అయోధ్య ట్రస్ట్ కు ఇవ్వాలని, అక్కడ రామమందిరం కట్టుకోవడానికి అనుమతిస్తున్నట్టు సుప్రీం కోర్టు పేర్కొన్నది.  అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో దీనిపై ఇక వివాదం ముగినట్టే అని చెప్పి చాలామంది అనుకున్నారు.  


అటు యూపీ వక్ప్ బోర్డు దీనిపైనా తిరిగి రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం లేదని, తీర్పు సంతృప్తికరంగానే ఉన్నట్టు చెప్పింది.  అయితే, అయితే, ముస్లిం లా బోర్డు మాత్రం దీనిపై సమాలోచనలు జరిపింది.  అయోధ్యలో దేవాలయం కూల్చి మసీదు కట్టలేదు.  అలానే మసీదుకింద హిందువులు సంబంధించిన కట్టడం ఉన్నది.  కాబట్టి అక్కడ రామాలయం కట్టుకోవడానికి అనుమతి ఇస్తూ తీర్పు ఇచ్చింది.  


దేవాలయాన్ని కూల్చి బాబ్రీ మసీద్ కట్టలేదు కాబట్టి, ఈ బాబ్రీ మసీద్ భూమి ముస్లింలకు చెందుతుందని చెప్పి తిరిగి రివ్యూ పిటిషన్ వేసేందుకు ముస్లిం న్యాయవాదులు సిద్ధం అవుతున్నారు.  అయితే, అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాత్రమే అడుగు వేయాలని లా బోర్డు నిర్ణయం తీసుకుంది.  ఒకవేళ రివ్యూ పిటిషన్ వేసినా దానిపై రామమందిరానికి వ్యతిరేకంగా తీర్పు వస్తుంది అనుకోవడానికి వెళ్ళలేదు.  


ఒకవేళ రివ్యూ పిటిషన్ దాఖలైతే.. అక్కడ నిర్మాణం పనులు ఆగిపోతాయా అన్నది చూడాలి.  అలా కాకుండా రామాలయం నిర్మాణానికి అనుమతి ఇస్తూ కోర్టులో కేసు నడిస్తే పెద్దగా దాని గురించి పట్టించుకోరు.  కాబట్టి ఈ విషయంలో లా బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో చూడాలి.  పిటిషన్ దాఖలు చేసి రివ్యూ పిటిషన్ కూడా అయోధ్యకు అనుకూలంగానే వస్తే.. ఇక రామాలయానికి అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టే అవుతుంది.  రామాలయం ఇప్పటి నుంచి మొదలుపెట్టినా ఐదేళ్లు సమయం పడుతుందట.  


మరింత సమాచారం తెలుసుకోండి: