జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా డొక్కాసీతమ్మ అన్నదాన శిబిరాలు నిర్వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే కదా. పవన్ సొంతూరు అయినటువంటి ప్రకాశం జిల్లా చీరాలలో మాత్రం ఇప్పటివరకూ అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేయకపోవడం చర్చనీయా అంశం అయింది. సొంతూరిలోనే శిబిరాలు ఏర్పాటు చేయలేని పవన్ కళ్యాణ్ రాష్ట్రం మొత్తం పెడుతున్నాడా..అని స్థానికులు పెదవి విరుచుకుంటున్న సందర్భాలు లేకపోలేదు. 


జనసేన అధినేత పవన్ కళ్యాణ్  బాల్యం గడిచింది చీరాలలోనే.  మెగాస్టార్ కుటుంబం చాలాకాలం నివసించినది ఇక్కడే. పవన్ కల్యాణ్ బాబు అసంఖ్యాకమైన అభిమానులు కూడా ఉన్నారు. అయినా   ఈ పట్టణములో  పవన్ కళ్యాణ్ పార్టీ పతాక౦ ఎగరడం లేదు. భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా డొక్కాసీతమ్మ అన్నదాన శిబిరాలు నిర్వహించగా  అలాంటివి ఇక్కడ జరగలేదు. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించి తమ పార్టీ వారి చేత రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులపాటు  అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేయించారు. 


అయితే  చీరాల లో మాత్రం ఇలాంటి అన్నదాన శిబిరాన్ని జనసేన ఏర్పాటు చేయలేదు. పవన్ కళ్యాణ్ కు అనుకూలంగానో, పవన్ కళ్యాణ్ ని విమర్శించిన వారిని తిట్టడానికో పోటీపడి ప్రెస్ మీట్ లు పెట్టేచీరాల జనసేన నాయకులు పార్టీ అధినేత ఆదేశం మేరకు పదిమందికి అన్నం పెట్టలేకపోయారు. మెగా హీరోల సినిమాలు రిలీజ్ అయితే బెనిఫిట్ షోల పేరుతో బాగానే డబ్బులు దండుకుని అభిమానులు సైతం ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడం కొస మెరుపు. ఇదనే కాదు చీరాలలో జనసేన కార్యక్రమాలు ఏమి జరగవు.ఒకవేళ జరిగినా  పది మంది లోపు హాజరవుతుంటారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో  చీరాలలో జనసేన అభ్యర్థి రంగంలో లేడు. బీఎస్పీ అభ్యర్థి కి జనసేన మద్దతు ఇచ్చింది. ఆయనకు  రెండు వేల లోపు ఓట్లు వచ్చాయి. ఇదీ  చీరాలలో జనసేన కున్న బలం.. బలగం..


మరింత సమాచారం తెలుసుకోండి: