హైదరాబాద్ మహానంగరంలో రోజు రోజుకు ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  ఈ ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నా ట్రాఫిక్ మాత్రం తగ్గడం లేదు.  తగ్గకగా విపరీతంగా పెరిగిపోతున్నది.  ముఖ్యంగా బంజారాహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ఏరియాల్లో ట్రాఫిక్ పెరిగిపోతున్నది.  ఈ ట్రాఫిక్ ను తగ్గించేందుకు ఇన్నర్ గా వంతెనలు నిర్మిస్తున్నారు.  


అయితే, ఈ వంతెనలు మాములుగా వాటిలా ఉంటె పెద్దగా ఉపయోగం ఉండదు.  అందుకే పర్యాటకంగా కూడా ఈ వంతెనను ఆధారంగా చేసుకొని నిర్మించాలని ప్లాన్ చేశారు.  ఇందులో భాగంగానే దుర్గం చెరువుపై వంతెనను నిర్మిస్తున్నారు.  రోడ్ నెంబర్ 45 నుంచి.. ఇనార్బిట్ మాల్ వరకు ఈ వంతెన నిర్మాణం జరుగుతున్నది.  రోప్ వే ఆధారంగా వంతెనను నిర్మిస్తున్నారు.  


ఎల్ అండ్ టి సంస్థ ఈ వంతెనను నిర్మిస్తోంది.  బలమైన రోప్ వే ఆధారంగా దీనిని నిర్మిస్తోంది.  ఇప్పటికే చాలా వరకు నిర్మాణ పనులు పూర్తయ్యాయి.  దుర్గం చెరువు చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేస్తూ పర్యాటకాన్ని పెంచుతున్నది.  ఈ రోప్ వే నిర్మించడం వలన పర్యాటకంగా కూడా అభివృద్ధి చేసినట్టు అవుతుంది.  అందుకోసమే ఈ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 

ఈ నిర్మాణాన్ని త్వరలోనే ఓపెన్ చేయబోతున్నారు.  దీనికి సంబంధించిన ఫోటోలను కేటీఆర్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు.  ఆసియాలోనే రెండో అతిపెద్ద రోప్ వంతెన ఇదే కావడం విశేషం.  ఈ వంతెన అందుబాటులోకి వస్తే, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ఏరియాల్లో ట్రాఫిక్ కొంతవరకు తగ్గుతుంది.  పర్యావరణం పరంగా కూడా దుర్గం చెరువును అద్భుతంగా తీర్చి దిద్దుతున్నారు.  ఆహ్లదకరంగా ఉండటంతో పాటుగా  అన్ని రకాలుగా హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తున్నది ప్రభుత్వం.   త్వరలోనే ఈ వంతెనను ఓపెన్ చేస్తారట.  


మరింత సమాచారం తెలుసుకోండి: