తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే. దుర్గం చెరువు దగ్గర భారీ బడ్జెట్ తో సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం సుందరీకరణ పనుల్లో భాగంగా రోప్ బ్రిడ్జిను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దుర్గం చెరువు దగ్గర సింగిల్ పోల్ సపోర్ట్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతున్నాయి. 
 
హైదరాబాద్ నగరవాసులకు ఈ బ్రిడ్జి పనులు పూర్తయిన తరువాత రవాణా ఎంతో సులభంగా మారుతుంది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా బ్రిడ్జి నిర్మాణ పనులను షేర్ చేశారు. చెరువుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. ఈ రోప్ బ్రిడ్జి ఆసియా ఖండంలోనే రెండవ అతి పెద్ద రోప్ బ్రిడ్జిగా రికార్డులను సొంతం చేసుకోబోతుంది. 
 
కేటీఆర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ట్విట్టర్ ద్వారా షేర్ చేయటంతో ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎల్ అండ్ టీ కంపెనీ ఈ బ్రిడ్జీని నిర్మిస్తూ ఉండగా ఈ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చిన తరువాత హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాలలో తగ్గే అవకాశాలు ఉన్నాయి. దేశంలో పర్యాటక రంగంలో ప్రత్యేకత చాటుకున్న హైదరాబాద్ కు దుర్గం చెరువు మరింత శోభను తీసుకురానున్నది. 
 
దుర్గం చెరువు హైదరాబాద్ నగరవాసులకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదంను కూడా పంచనున్నది. ప్రభుత్వం చొరవ తీసుకొని అత్యాధునిక సదుపాయాలను కల్పించటంతో దుర్గం చెరువు స్వరూపం పూర్తిగా మారిపోయింది. కేటీఆర్ చేసిన ట్వీట్ ను భారీ ఎత్తున నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు. దుర్గం చెరువు అందాలు విదేశాలను తలపిస్తోందని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: