ఎన్టీఆర్ గొప్ప నటుడు అందులో డౌట్ లేదు.  హ్యాపీగా తన సినిమాలు తాను చేసుకుంటూ పోతున్నాడు.  తండ్రి ఉన్న ఆరోజుల్లో అప్పుడప్పుడు రాజకీయం గురించి మాట్లాడేవాడు.  ఇప్పుడు అసలు రాజకీయాల గురించి అసలు మాట్లాడటం లేదు.  సైలెంట్ గా సినిమాలు చేసుకుంటున్నాడు.  రాజకీయాల గురించి మాట్లాడటం మొదలు పెడితే కెరీర్ ఎక్కడ ఆగం అవుతుందో అని భయపడుతున్నాడు.  


ఇంకా చెప్పాలి అంటే, అసలు వాటి వాసన కూడా చూడటం లేదు.  ఇప్పుడు ప్రశాంతంగా వరసగా హిట్స్ కొడుతున్న ఎన్టీఆర్ కెరీర్లో మరలా రాజకీయ అలజడి మొదలైంది.  తన అనుమతి లేకుండానే, రాజకీయాలోకి లాగుతున్నారు. దీంతో ఎన్టీఆర్ కొద్దిగా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.  తెలుగుదేశం, వైకాపా పార్టీల మధ్య జరుగుతున్న ఆధిపత్య వైరంలో ఎన్టీఆర్ పేరును లాగుతున్నారు.  


వల్లభనేని వంశి మొదటగా ఎన్టీఆర్ పేరును ప్రస్తావించారు.  ఎన్టీఆర్ తన సినిమా కెరీర్ను పణంగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చారని, కానీ బాబుగారు ఎన్టీఆర్ ను వాడుకొని పక్కన పెట్టారని బలంగా చెప్పడంతో.. ఎన్టీఆర్ పేరు తెరమీదకు వచ్చింది.  తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన వంశి ఇలా ఎన్టీఆర్ గురించి మాట్లాడటం ఆశ్చర్యం వేస్తోంది.  చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ వాళ్ళ గురించి మాట్లాడితే సరిపోతుంది కూడా ఎన్టీఆర్ పేరును ఎందుకు తీసుకొచ్చారని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు.  


గతం గతహా అని ఎన్టీఆర్ ఇప్పుడు సినిమా రంగంలో బిజీగా ఉన్నాడు.  రాజకీయాల వైపు చూడటం లేదు.  కానీ, రాజకీయంగా లబ్ది పొందటం కోసం ఇలా ఎన్టీఆర్ పేరును వాడుకోవడం మంచిది కాదని అభిమానులు అంటున్నారు.  అయితే, దీనిపై ఎన్టీఆర్ ఎలాంటి స్పందన చేయలేదు. అలానే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఎన్టీఆర్ పేరును ఎక్కడ వల్లించడం లేదు.  ఎన్టీఆర్ పేరును వాడకుండా ఉంటేనే మంచిది అన్నది ఎన్టీఆర్ అభిమానుల అభిప్రాయం.  


మరింత సమాచారం తెలుసుకోండి: