గత కొన్ని రోజులుగా టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం. నారా లోకేష్ ను  జూనియర్ ఎన్టీఆర్ తో పోలుస్తూ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వంశి వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇక తాజాగా వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలపై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వల్లభనేని వంశీ ఇంకా హ్యాంగ్ ఓవర్ లోనే  ఉన్నారు  అంటూ లోకేష్ విమర్శలు చేశారు తాజాగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ నారా లోకేష్... వల్లభనేని వంశీ పై విమర్శలు గుప్పించారు. వంశీ 2009 ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ గెలుచిందని...  ప్రస్తుతం 2019 నడుస్తుందని... కానీ ఇంకా వంశీ 2009 లోనే  ఉన్నాడు అంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. 



 రాజీనామా చేస్తాను చేస్తాను అని చెబుతున్న వల్లభనేని వంశీ ఎందుకు చేయడం లేదంటూ నారా లోకేష్ ప్రశ్నించారు. వల్లభనేని వంశీకి భయం ఉందని...  అందుకే టిడిపి పార్టీకి రాజీనామా చేయడం లేదంటూ నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ఒకవేళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మళ్ళీ గెలుస్తానో  లేదో అని  వంశీకి భయం పట్టుకుందని అందుకే రాజీనామా చేయడం లేదని  లోకేష్  విమర్శించారు.  వల్లభనేని వంశీ రోజుకో మాట మారుస్తున్నాడు అంటూ లోకేష్ ఆరోపించారు. టిడిపి పార్టీ నుంచి ఒకరిద్దరు నేతలు వెళ్లిపోయిన అంతమాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం కలుగదు నారా లోకేష్  స్పష్టం చేశారు. 



 టిడిపి నుంచి నేతలు వెళ్లిపోయిన కార్యకర్తలు పోరాడుతామని టిడిపి పార్టీకి అండగా నిలబడతారని చెప్పారు నారా లోకేష్. వల్లభనేని వంశీ లాంటి వాళ్ళని ఎంతోమందిని చూసాం అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. పార్టీలోకి ఎంతో మంది నేతలు వస్తుంటారు పోతుంటారు వంశీ లాంటి నేతలు వెళ్లిపోయిన పార్టీకి పెద్ద నష్టం లేదని స్పష్టం చేసారు నారాలోకేష్.  ఇన్ని  మాటలు మాట్లాడే వంశీ  ఓ కార్యకర్త చనిపోతే వచ్చారా పట్టించుకున్నారా అంటూ లోకేష్ నిలదీశారు. 2019 ఎన్నికల ముందు వల్లభనేని వంశీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్ని తిట్టారో  అందరికీ తెలుసన్నారు. మళ్లీ ఇప్పుడు ప్లేటు ఫిరాయించి జగన్ ని పొగుడుతున్నారు అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: