తెలుగుదేశం పార్టీని ఎవరు స్థాపించారు అంటే అంతా చెప్పేది అన్న నందమూరి తారక రామారావు అని ఒకటే మాట. మరి  అటువంటి  అన్న గారి వారసుడు, ఇంటిపేరులోనే కాదు, ఒంటి రూపులో కూడా పెద్దాయన్ని పూర్తిగా సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీయార్ కు  ఆయన సినీ వారసత్వం దొరికింది. మరి రాజకీయ వారసత్వం మాత్రం దక్కడంలేదు. దానికి కారణాలు ఏంటి..


పార్టీలో తండ్రి హరిక్రిష్ణ కరివేపాకులా బాబుకు ఉపయోగపడ్డారు. ఇక 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీయార్ తన తండ్రికి రాజ్యసభ సీటు ఇచ్చారన్న కారణంతో పార్టీ కోసం శ్రీకాకుళం నుంచి ఖమ్మం వరకూ ప్రచారం చేశారు. ఈ దశలో ప్రాణాపాయం నుంచి కూడా త్రుటిలో  తప్పి బయటపడ్డారు. సరే ఇంత చేసినా కూడా అప్పటి రాజకీయ సమీకరణల కారణంగా టీడీపీ ఓడిపోయింది. అయితే ఈ తప్పు అంతా జూనియర్ దేనని చినబాబు లోకేష్ అనేస్తున్నారట‌.


నిజమే  2009 ఎన్నికల్లో జూనియర్  ప్రచారం  చేస్తే టీడీపీకి ఏం ఒరిగింది, పార్టీ గెలిచిందా అన్నట్లుగా లోకేష్ మాట్లాడుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇక జూనియర్ లేకపోయినా కూడా 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. దాని వెనక తన వ్యూహాలు, తన తండ్రి చంద్రబాబు కష్టం ఉందన్నది లోకేష్ భావన. అయితే చంద్రబాబు కూడా ప్రధాన సారధిగా 2009 ఎన్నికల్లో ప్రచారం చేశారు, 2004 ఎన్నికల్లో ప్రచారం చేశారు. మరి ఓడిపోయిన తరువాత బాబు నాయకత్వం  కాదు, కుదరదు అని ఎవరైనా అన్నారా... 


గెలుపు ఓటములు పక్కన పెడితే పార్టీలోనూ, బయటా కూడా జూనియర్ కి ఆదరణ ఉందన్నది నిజం. మరి జూనియర్ ని తొక్కేశాడని వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారు అంటుంటే దానికి టీడీపీ వద్ద సమాధానం లేదు.  మరి 2024 ఎన్నికల్లో టీడీపీని గెలిపించడానికి లోకేష్ భరసా ఇవ్వగలరా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఒక్క ఎన్నికల ప్రచారానికే జూనియర్ రాజకీయాలకు పనికిరారని నిర్దారిస్తే మంత్రి పదవులు కూడా పొందిన లోకేష్ లాంటి వారు పోటీ చేసి మంగళగిరిలో స్వయంగా ఓడిపోయారు కదా అని కూడా ప్రత్యర్ధులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: