టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీకి రాజీనామా చేసిన గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. రాబోయే రోజుల్లో టీడీపీ ఓ చరిత్రగా మిగిలిపోతుందన్నారు. 2024లో ఇతర పార్టీలతో పొత్తులతో నెట్టుకొచ్చినా.. 2029 నాటికి టీడీపీ పార్టీ చరిత్రగా మిగిలిపోవడం ఖాయమన్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కూడా గెలవడం కష్టమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ద‌మ్ముంటే...త‌న‌పై చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ పోటీ చేసినా...ఓకే అని ప్ర‌క‌టించారు. అయితే, ఇలా ఘాటు కామెంట్లు చేసిన నేత‌పై తెలుగుదేశం పార్టీ స‌స్పెన్ష‌న్ వేటు వేసిందే త‌ప్పించి..ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌వి పోయేలా అన‌ర్హ‌త వేటు వేయాల‌నే ఫిర్యాదు చేయ‌లేదు. దీనికి టీడీపీలో మొద‌లైన క‌ల‌వ‌ర‌మే కార‌ణ‌మంటున్నారు. 


గన్నవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వంశీ.. వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అయితే వంశీని పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్ప‌టికీ....త‌మ పార్టీ ద్వారా సంక్ర‌మించిన ఆ ప‌ద‌వి విష‌యంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ వెనుకడుగు వేస్తోంది. వంశీ రాజీనామా, ఆమోదం పొందే విష‌యంలో...టీడీపీలో క‌ల‌వ‌రం నెల‌కొంద‌ని అంటున్నారు. వంశీతో పాటుగా మ‌రో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారితే..వారిపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని టీడీపీ కోరితే..స్పీక‌ర్ వేటు వేస్తే...టీడీపీకి ఉన్న ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ వంశీ ఎమ్మెల్యే పదవిపై వేటు వేయమని స్పీకర్‌ను కోరే సాహసం చేయడంలేదంటూ నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే ఎమ్మెల్యే వంశీ స‌వాల్ విసిరిన‌ప్ప‌టికీ...టీడీపీ నేత‌లు సంయ‌మ‌నం పేరుతో సైలెంట్ అయిపోతున్నార‌ని చెప్తున్నారు. పార్టీకి చెందిన‌ ఎమ్మెల్యేలు కూడా జంపింగ్‌కు రెడీ అయ్యారనే వార్త‌ల నేప‌థ్యంలో..తెలుగుదేశం నేత‌ల గురించి వ‌స్తున్న ఈ కామెంట్ల‌లో నిజ‌మెంతో తెలియాలంటే..మ‌రికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: