రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల వ్యాఖ్య‌ల‌కు అంతే దీటుగా స‌మాధానం చెప్ప‌డం అంటే.. అదో ఆర్ట్‌! ఇది అంద‌రికీ వ‌చ్చేది కాదు. కోరి తెచ్చు కుందామ‌న్నా ఎక్క‌డా దొరికేదీ కాదు!! ఇప్పుడు టీడీపీలో ఇదే చ‌ర్చ సాగుతోంది. నిన్న‌టికి నిన్న వైసీపీ నాయ‌కుడు, మంత్రి కొడా లి నాని టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న మాజీమంత్రి దేవినేని ఉమా, బాబు కుమారుడు లోకేష్‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచు కుప డ్డారు. ఇసుక నుంచి ఇంగ్లీష్ వ‌ర‌కు దుమ్ముదులిపి వ‌దిలి పెట్టారు. దాదాపు అర‌గంట సేపు ఆప‌కుండా కుమ్మ‌రించిన కామెం ట్లు.. టీడీపీలో అల‌జ‌డి రేపాయి. అప్ప‌టి వ‌ర‌కు కొడాలి వేరు.. ఆ త‌ర్వాత కొడాలి వేరు.. అనే రేంజ్‌లో నాని చెల‌రేగిపోయారు.


ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌ను తిరుప‌తి శ్రీవారి ద‌ర్శ‌నానికి వెళ్లిన‌ప్పుడు డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌లేదంటూ.. ఇసుక దీక్ష స‌మ‌యం లో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను కోట్ చేసిన మంత్రి కొడాలి.. తిరుప‌తిని నీ బాబు క‌ట్టించాడా? అంటూ విరుచుకుప‌డ్డారు. జ‌గ‌న్ త‌లు చుకుంటే.. టీడీపీనే ఉండ‌ద‌ని వ్యాఖ్యానించారు. ఇక‌, మ‌ద్యం విష‌యంలోనూ పాద‌యాత్ర స‌మ‌యంలో జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య ల‌ను ఉటంకించిన కొడాలి.. ఈ విష‌యంలో మాజీ మంత్రి ఉమాపై తీవ్ర ధ్వ‌జం ఎత్తారు. ఆడు.. ఈడు.. అంటూ విరుచుకుప‌డ్డారు. 


దీంతో ఒక్క‌సారిగా రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం ఏర్ప‌డింది. ఇక‌, దీనికి ప్ర‌తిగా టీడీపీ నుంచి కౌంట‌ర్లు వ‌స్తాయ‌ని రాజ‌కీయ ఆస‌క్తి ఉన్న వారు ఎదురు చూశారు. అనుకున్న‌ట్టుగానే టీడీపీ ఉంచి కొడాలి నానికి కౌంట‌ర్ ఇచ్చేందుకు మాజీ మంత్రి దేవినేని ఉమా రంగంలోకి దిగారు. నాని టీడీపీ అధినేత బాబుపైనా, త‌న‌పైనా చేసిన వ్యాఖ్య‌ల‌ను పేర్కొంటూ.. మాట్లాడారు. కానీ, కొడాలి రేంజ్‌లో దేవినేని ఊపు చూపించ‌లేక పోయారు. అంటే.. రాజ‌కీయంగా ఈయ‌న‌ను దిగ‌జారి మాట్లాడ‌మ‌నే ఉద్దేశం కాదు.. కానీ, స‌రైన విధంగా విష‌యం ప‌రంగా చూసుకున్నా.. దేవినేని నిల‌బ‌డ‌లేక పోయారు. 


మ‌ద్యం విష‌యాన్నిఎలిమినేట్ చేసేశారు. ఇక‌, ఇంగ్లీష్ విష‌యంలో పూర్తిగా త‌గ్గిపోయారు. తాము ఇంగ్లీష్ వ‌ద్ద‌ని అన‌లేద‌ని అంటూ.. తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వాల‌ని కోరుతున్నాం.. అంటూ పాత పాట‌నే పాడారు త‌ప్ప‌.. స‌రైన విధంగా దీనిపై స్పందించ‌లేద‌నే అభిప్రాయం పార్టీ వ‌ర్గాల నుంచే వినిపిస్తోంది. ఏదేమైనా.. టీడీపీలో ఫైర్ బ్రాండ్‌ల‌కు కొర‌త ఏర్ప‌డింద‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. పైగా అభ‌ద్ర‌తా భావం కూడా దేవినేని ఉమాలో క‌నిపించ‌డం విశేషం అంటున్నారు నెటిజ‌న్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: