గత కొన్ని రోజులుగా వస్తున్న వార్త ఏంటంటే తిరుమల లడ్డూ ప్రసాదం ధరలను టీటీడీ భారీగా పెంచబోతోందని. ఇప్పటి వరకూ సామాన్య భక్తులకు అందజేస్తున్న ఉచిత లడ్డూ ప్రసాదాన్ని యథాతథంగా ఉంచి.. ఆ పైన కొనుగోలు చేసే ఒక్కో లడ్డూ ధరను పెంచుతున్నట్లు వార్త వ్యాపించింది.. ఇక జనాలు ఎలా ఉన్నారంటే ఇది నిజమా? కాదా ?అని కూడ తెలుసుకోరు ఏది చెప్పిన నమ్మేస్తారు. ఆ తర్వాత ఆ విషయాన్ని అందరికి ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఇదే విషయంలో టీటీడీ వారు క్లారిటి ఇచ్చారు.


అదేమంటే శ్రీవారి ప్రసాదం తయారీ వీషయంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించి, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరల పెంపు విషయంపై లడ్డూ ధరలు పెంచుతున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. అంతే కాకుండా అవన్నీ వదంతులేనని తేల్చిచెప్పారు. ఇప్పట్లో లడ్డూ ధరలు పెంచే ఆలోచన టీటీడీకి లేదని స్పష్టం చేశారు. ఇక ఉద్దేశపూర్వకంగా వదంతులు ప్రచారం చేస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


ఇకపోతే మార్కెట్ ధర ప్రకారం లడ్డూ తయారీకి టీటీడీ సుమారు రూ. 40 ఖర్చు చేస్తోందని. ప్రస్తుతం రూ.25గా భక్తులకు అందిస్తుందని. లడ్డూలపై భక్తులకు ఇస్తున్న రాయితీతో భారీ నష్టం వస్తోందని టీటీడీ భావిస్తున్నట్లు సమాచారం. అధికారుల సమీక్షలో ఈ విషయంపై చర్చించినట్లు కూడా వార్తలొచ్చాయి. భక్తులకు అందజేస్తున్న ఈ రాయితీని తొలగించాలనే నిర్ణయానికి వచ్చారని.. అదే విషయాన్ని టీటీడీ బోర్డుకు నివేదించనున్నట్లు ప్రచారం జరిగింది.


ఇదేకాకుండా ఒక్కో లడ్డూను రూ.50కి విక్రయించేందుకు నిర్ణయించారన్న వాదనలు కూడా వినిపించాయి. ఈ వార్త విన్న భక్తుల్లో ఆందోళన మొదలైంది. పవిత్రంగా భావించి స్వీకరించే శ్రీవారి ప్రసాదాన్ని పెంచడమనే విషయాన్ని చాలా మంది భక్తులు ఖండించారు కూడా. ఇకపోతే ఏడుకొండలపై నున్న శ్రీవారి నిలయం తిరుమల అంటే ప్రపంచం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు.ఆ స్వామి వారి ఆదాయాం కూడా ఎప్పుడు భారీగానే ఉంటుంది కాని ఈ దశలో శ్రీవారి లడ్డూల ధరలు పెంచవలసిన అవసరం ఏముందని కొందరు మనసులో ప్రశ్నించుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: