కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనకడుగు వెయ్యాల్సి వచ్చింది. తల్లి వైఎస్ విజయమ్మ పేరుతో ఉన్న ఛారిటబుల్ ట్రస్ట్ ను కేంద్రం రద్దు చేసింది. విదేశీ నిధుల నియంత్రణ చట్ట 2010లోని సెక్షన్ 14 కింద వైఎస్ విజయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ను రద్దు చేసినట్టు సమాచారం. 

                         

అయితే ఒక్క విజయమ్మకు సంబంధించిన ట్రస్టు మాత్రమే కాదు తెలంగాణలో 90, ఏపీలో 168 ఎన్జీఓలను కేంద్రం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే అందులో కొన్ని చర్చిలు, విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. విదేశాల నుండి ఎంత డబ్బు వస్తుంది.. ఆ డబ్బుని ఎలా ఖర్చు చేస్తారు అనే అంశంపై వార్షిక నివేదికలు కేంద్రం సమర్పించడంలో విఫలమయ్యింది. 

                         

రద్దు చేసిన వాటిలో 90శాతం క్రిస్టియన్ మతానికి సంబంధించినవే ఉన్నాయి. ఎన్‌జీఓల పేరిట మత ప్రచారాలను చేస్తున్నారని, మత మార్పిళ్ల మాఫియాకు అడ్డుకట్టవేయాలనే ఉద్ధేశ్యంతోనే కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మరోవైపు ఆంధ్రాలో కూడా క్రిస్టియన్ సంస్థ కార్యకలాపాలు విస్తృతమయ్యాయి అని,

                  

మత మార్పిళ్లు చేస్తున్నామని గొప్పగా చూపించుకుని.. విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులు సేకరిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అందుకే వాటిని కట్టడి చేయడానికి కేంద్రం రంగంలోకి దిగినట్లుగా సమాచారం. మరి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై వైసీపీ నాయకులూ ఎలా స్పందిస్తారు అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: