అక్రమ సంబంధాలు అనేవి భారతదేశంలోనే ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో విదేశాల్లో కూడా ఈ రకమైన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వినపడుతున్నాయి. అది కూడా సాధారణ వ్యక్తిపై కాకుండా దేశాన్ని పాలించే పెద్ద మనిషి పై అక్రమ సంబంధమైన సంబంధాలు పెట్టుకుంటున్నారనే ఆరోపణలు ఎదుర్కొటున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే.. బ్రిటన్ దేశాల్లో ఈ విషయం వెలుగు చూసింది.                             


వివరాల్లోకి వెళితే..  బ్రిటన్ ప్రధాని మంత్రి బోరిస్‌ జాన్సన్‌కు తనకు మధ్య సంబంధం ఉన్నట్లు వస్తున్న వార్తలపై ప్రముఖ వ్యాపారవేత్త  జెన్నిఫర్‌ ఆర్కురీ స్పందించారు. ఈ వార్తలు తనను తీవ్ర అవమానకరంగా, హృదయవిదారకంగా తోచాయని అన్నారు. ఒక వ్యక్తిపై నిజా నిజాలు తెలుసుకోకుండా ఏది పడితే అది అనుకోకండి అంటూ ఆమె ఆ దేశ మీడియా పై విరుచుకు పడ్డారు. 


ప్రభుత్వాన్ని ఏలే పెద్ద వ్యక్తితో నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఒక వాణిజ్య వ్యాపారిని కేవలం బిజినెస్ కోసం నేను ఎప్పుడూ పెద్ద వ్యక్తులతో మాట్లాడటం నాకు అవసరం. అంతేకాకుండా ఈ రోజు వంద మందితో మాట్లాడుతాను వారితో సంబంధం పెట్టుకున్నని మాత్రం నోటికొచ్చినట్లు మాట్లాడకండి. అంటూ ఆమె మండిపడుతున్నారు.  ఈ మేరకు ఆదివారం ఓ మీడియా ఛానెల్‌లో మాట్లాడుతూ.. వివరణ ఇచ్చారు. జాన్సన్‌ లండన్‌ మేయర్‌గా ఉన్న సమయంలో తాను ఆర్థికంగా ఎలాంటి లబ్ధి పొందలేదని తెలిపారు. తనకు, జాన్సన్‌కు సంబంధముందటూ వస్తున్న వార్తలు పూర్తిగా ఆవాస్తమని చెప్పారు.


అంతేకాకూండా ఈ విషయం పై మాట్లాడుతూ.. నాకు ఎటువంటి సంబంధాలు లేదుతమ ఇద్దరిమధ్య ఏదో సంబంధం లేదని వచ్చిన వార్తలు చాలా అవమానంగా, అసహ్యంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. జాన్సన్‌ మేయర్‌గా ఉన్న సమయంలో వేల పౌండ్ల ప్రజా ధనాన్ని ఆర్కురీ పొందినట్లు, పలు వాణిజ్య సదస్సులకు పాల్గొనే అర్హత లేనప్పటికి జాన్సన్‌ జోక్యంతో ఆమె పలు సదస్సులకు హారైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.  ఈ విషయం పై మరో కోణం ఎలా వెళుతుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: