వారే వా.. ఒక వైపు హత్యలు జరుగుతున్న కొంతమందికి తెలివి రావడం లేదు. మరో వైపు తహసీల్దార్ లు అందరూ భయంతో వణికిపోతున్న వీఆర్వోలు మాత్రం లంచం గురించి తహసీల్దార్ ముందే గొడవ పడుతున్నారు. కాదు కాదు తన్ను కున్నారు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. 

                 

కర్నూలు జిల్లాలోని ఎమ్మార్వో కార్యాలయంలో ఇద్దరు వీఆర్వోలు కొట్టుకున్న ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లంచం డబ్బుల పంపకాల్లో వివాదం ఏర్పడడంతో ఇద్దరు వీఆర్వోలు తహసీల్దార్ ముందే తీవ్రంగా కొట్టుకున్నారు. తనను డబ్బు కోసం వేధిస్తున్నాడంటూ ఒక వీఆర్వో మరో వీఆర్వో చెవిని కొరికేశాడు. దీంతో రెండో వీఆర్వో ఎదురుదాడికి మరో వీఆర్వో మెడపై రక్కేశాడు. ఇద్దరు వీఆర్వోలు కొట్టుకోవడంతో కంగుతిన్న ఎమ్మార్వో వెంటనే తేరుకుని ఇద్దరి మధ్య రాజీకి ప్రయత్నించారు. కొంత సమయానికి ఇద్దరూ శాంతించడంతో ఎమ్మార్వో సహా అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు.


అయితే ఆ వీఆర్వోలు ఇద్దరు ఒకరు కర్నూలు మండలం సుంకేసుల వేణుగోపాల్‌రెడ్డి మరొకరు జోహారాపురం గ్రామం వీఆర్వో కృష్ణదేవరాయ మధ్య గొడవ జరిగి ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ తహశీల్ధార్ విజయారెడ్డి సజీవదహనం తర్వాత తసీల్ధార్లు ఎంత భయపడుతున్నారో మనం రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘోరమైన ఘటనలు మనం చేస్తున్నప్పటికి అదే తహశీల్ధార్ ముందు లంచం డబ్బుల కోసం గొడవపడటం ఆశ్చర్యంగా ఉంది. ఏది ఏమైనప్పటికి ఈ ఘటనతో ఆ విఆర్వోలకు కొంచం కూడా భయం లేదు అనేది అర్థమవుతుంది. లంచం తీసుకునే గాడిదలు ఉన్నాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: