ఢిల్లీలో పార్లమెంటరీ హౌస్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో అన్ని పార్టీలకు చెందిన ప్రధాన ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు.  ఈ సమావేశాలకు వైకాపా తరపున విజయసాయి రెడ్డితో పాటుగా మిథున్ రెడ్డి కూడా వైకాపా తరపున హాజరయ్యారు.  ఇలా పార్టీ తరపున హాజరైన విజయసాయి రెడ్డికి బీజేపీ క్లాస్ పీకింది.  


దానికి కొన్ని కారణాలు ఉన్నాయి.  అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ ఎంపీ చిదంబరం కూడా పార్లమెంట్ సమావేశాలకు హాజరకు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, దానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరింది.  దీనిపై బీజేపీ నోట్ తయారు చేసుకున్నారు.  అయితే, కాంగ్రెస్ పార్టీ అడిగిన వెంటనే వైకాపా కలుగజేసుకొని, అలా కుదరదని, గతంలో జగన్ జైల్లో ఉండగా, జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా ఎంపీగా ఆహ్వానించలేదని, ఇప్పుడు చిదంబరంను ఎలా ఆహ్వానిస్తారని విజయసాయి రెడ్డి అడిగాడు.  


కాంగ్రెస్ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం జవాబు ఇవ్వాలి.  అంతేగాని,వైకాపా మధ్యలో ఎందుకు కలుగజేసుకుంది.  ఇలా వైకాపా మధ్యకు కలుగజేసుకోవడం బీజేపీకి నచ్చలేదు.  దీంతో వైకాపా ఎంపీపై కేంద్రం మండిపడింది.  అఖిలపక్ష సమావేశం అన్ని పార్టీల సభ్యులు అడిగిన ప్రశ్నలు వినాలని, దానికి తగినట్టుగా మాట్లాడాలని, ఇది కేంద్రం చెప్పాల్సిన జవాబు అని, విజయసాయి రెడ్డి ఎందుకు కలుగజేసుకుంటున్నారు అని బీజేపీ ప్రశ్నించింది.  


అటు కాంగ్రెస్ పార్టీ సైతం వైకాపాపై గుర్రుగా ఉన్నది.  అనవసరమైన విషయాల్లో తల దూరుస్తుందని, అలా చేయడం తగదని పార్టీ కాంగ్రెస్ అంటోంది.  మొత్తానికి జగన్ పార్టీ అనవసరమైన విషయాల్లో ఎక్కువగా ఫోకస్ చేస్తూ చేతులు కాల్చుకుంటోంది.  దీనిద్వారా తన పరువును తానే తీసుకుంటోంది ఆ పార్టీ.  అఖిలపక్ష సమావేశంలోనే ఇలా మాట్లాడితే... రేపు సమావేశాల్లో ఎలా మాట్లాడుతుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: